high court :హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ ముగ్గురు నిందితుల దర్యాప్తుపై కోర్టు స్టే ఎత్తేసింది. బీజేపీ పిటిషన్‌ను కోర్టు పెండింగ్‌లో పెట్టింది. పిటిషన్‌పై లోతైన విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.