Homeహైదరాబాద్latest Newsఖాజాగూడాలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

ఖాజాగూడాలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం

ఖాజాగూడలో హైడ్రా కూచివేతలు జరిపింది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్‌లో ఇళ్లు నిర్మించారని హైడ్రా అధికారులు వెల్లడించారు. 20కి పైగా దుకాణాలని అక్కడి నుండి తొలగించారు. అయితే తాజాగా ఖాజాగూడాలో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అది FTL పరిధిలో ఉన్నట్టు ఎలా చెప్తున్నారు.. ఆధారాలు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. FTL, బఫర్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారు అని ప్రశ్నించింది. ఇలాంటివి పునరావృతం అయితే కమిషనర్ రంగనాథ్ పై సీరియస్ వ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్ కి చెప్పండి ఇలా చెయ్యవలసిన అవసరం లేదని పిటిషనర్ కూడా GHMC పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు, పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా 24 గంటల్లో పిటిషనరే తొలగించాలి అని జస్టిస్ లక్ష్మణ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img