High Court : తెలంగాణలో రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ థియేటర్లకు ఉపశమనం లభించింది. ఈ క్రమంలో హైకోర్టు (High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సినిమా ప్రదర్శనపై ఉదయం 11లోపు రాత్రి 11 తర్వాత అనుమతించవద్దంటూ హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే సినిమా ప్రదర్శనలపై ఆంక్షల నేపథ్యంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను సవరించి, 16 ఏళ్లలోపు పిల్లలు అన్ని షోలను చూడటానికి అనుమతించాలని తీర్పు వెలువరించింది. అయితే, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి లేదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలో పిల్లలు రెగ్యులర్ షోలను మాత్రమే చూడటానికి అనుమతి ఉంది అని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం కేసును మార్చి 17కి వాయిదా వేసింది.