ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం నేడు భీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్. కె. లక్ష్మణ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆ తరువాత అర్చకులు ఆశీర్వచనం ఇచ్చిన తదుపరి శ్రీ స్వామివారి శేషవస్త్రం ఇచ్చి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు పెద్ద సంతోష్ కుమారా చార్యులు, చిన్న సంతోష్ కుమారా చార్యులు, మధుసూదనా చార్యులు, హేమంత్ కుమారా చార్యులు పాల్గొన్నారు.