High court orders to police on vehicle seize in Drunk and Drive cases : వాహనాల సీజ్‌పై పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశం..
డ్రంక్ ఆండ్ డ్రైవ్‌లో పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మధ్యం తాగి వాహనం నడిపినా వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసు వారికి లేదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే మధ్యం సేవించిన వ్యక్తికి మాత్రం వాహనం నడిపేందుకు అవకాశం ఇవ్వకూడదని తెలిపింది.
తాగి వాహనం నడుపుతూ దొరికిన వ్యక్తి వెంట తాగని, లైసెన్స్ ఉన్న వ్యక్తిని ఇచ్చి పంపాలని తెలిపింది.
లేదా సిబ్బంది లేనప్పుడు వాహనదారుడు లైసెన్స్ ఉన్న వ్యక్తిని రప్పించుకుని వెళ్ళేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టు సూచించింది.
ఈ క్రమంలో వాహనదారుని స్నేహితులను పిలిపించి వారికి వాహనాన్ని స్వాదీనం చేయాలని కోర్టు తెలిపింది.
ఎవరూ రాని క్రమంలో ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్ వద్ద ఉంచాలని సూచించింది హై కోర్టు.