TS High Court : జగన్, విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరణ
అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు (telangana high court) నిరాకరించింది.
ఈ మేరకు పిటిషన్ల బదిలీ కోరుతూ రఘురామ(mp raghurama) దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం నిన్న వ్యాఖ్యానించింది.
సాక్షిపై కోర్టు ధిక్కరణ కేసు హైకోర్టుకు బదిలీ
తాజాగా బెయిల్ రద్దు పిటిషన్ బదిలీని నిరాకరిస్తూ రఘురామ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
మరోవైపు ‘సాక్షి’ మీడియాపై దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును మాత్రం తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీకి హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.
ఎంపీ రఘురామ పిటిషన్
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.
సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించకుండా స్టే ఇవ్వడంతో పాటు.. బెయిల్ రద్దు పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ మంగళవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సహేతుకమైన కారణాలు ఉండాలని, ఇక్కడ అలాంటివేవీ లేకుండా ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతున్నారని ఉన్నత న్యాయస్థానం మంగళవారం వ్యాఖ్యానించింది.
దీనిపై వాదనలను విన్న న్యాయమూర్తి.. పిటిషన్ల బదిలీకి నిరాకరిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించారు.
మరోవైపు జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేశారంటూ ట్వీట్ చేసిన సాక్షి మీడియాపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలన్న రఘురామ పిటిషన్‌పైనా నేడు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.
కాసేపట్లో సీబీఐ కోర్టు తీర్పు
జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ వేసిన పిటిషన్‌లపై జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు.. గత నెల 24నే తీర్పు వెల్లడించనున్నట్లు ప్రకటించింది.
అయితే జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు ముగిసిన తర్వాత.. విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ మరో పిటిషన్ దాఖలు చేశారు.
రెండు పిటిషన్లలోనూ వాదనలు దాదాపు ఒకే తీరుగా జరిగాయి.
గత నెల 24న విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు విన్న సీబీఐ కోర్టు.. రెండు పిటిషన్లపై ఒకే రోజు తీర్పు వెల్లడిస్తామంటూ తీర్పును ఈరోజుకి వాయిదా వేసింది.