హైదరాబాద్, ఇదేనిజం : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇటీవల రాంగోపాల్ వర్మ, నట్టే కరుణ పై ఎస్సి, ఎస్టీ కేసు నమోదు అయింది. ప్రణయ్ ఉదంతాన్ని తెరకెక్కించేందుకు వర్మ తీస్తున్న చిత్రం పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ చిత్రానికి బ్రేక్ పడింది. దీంతో పాటు వర్మ చిక్కుల్లో పడ్డారు. జిల్లా ఎస్సి ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ పీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు చేశారు. కేసును సవాలు చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించారు వర్మ. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రాంగోపాల్ వర్మ, కరుణ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.