Homeసైన్స్​ & టెక్నాలజీHigh Secure Mobile in world : ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్‌ అందుబాటులోకి..

High Secure Mobile in world : ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఫోన్‌ అందుబాటులోకి..

  • ‘నైట్రోఫోన్‌ 1’ను తీసుకొచ్చిన జర్మనీ సంస్థ
  • గూగుల్‌ పిక్సెల్‌ 4ఏ కంటే మేటిదైన హార్డ్‌వేర్‌
  • హ్యాకర్లు కనిపెట్టకుండా ప్రత్యేక రక్షణ వ్యవస్థ
  • 6జీబీ ర్యామ్‌, 128 జీబీ డ్రైవ్‌.. ధర 55 వేలు

High Secure Mobile in world : స్మార్ట్‌ఫోన్లలో అత్యంత సురక్షితమైన ఫోన్‌ ఏది? అంటే ఆపిల్‌ ఐఫోన్‌ లేదా గూగుల్‌ పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్‌ అని చెప్తాం. అయితే, పెగాసస్‌ స్పైవేర్‌ ఉదంతం వెలుగులోకి రానంతవరకూ అందరూ అలాగే అనుకున్నారు. కానీ, ఈ స్పైవేర్‌తో ఐఫోన్లను కూడా హ్యాకింగ్‌ చేయవచ్చని వార్తలు రావడంతో ఇక సురక్షితమైన ఫోన్‌ లేదన్న నిర్ణయానికి అందరూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ఆండ్రాయిడ్‌ ఫోన్‌ను తీసుకొచ్చినట్టు జర్మనీకి చెందిన నైట్రోకీ కంపెనీ ఇటీవల ప్రకటించింది. ‘నైట్రోఫోన్‌ 1’ పేరిట తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ నిజంగానే భద్రమైనదని ప్రముఖ గ్యాడ్జెట్‌ రివ్యూ సైట్‌ ‘9టూ5గూగుల్‌’ వెల్లడించింది. మరి ఈ ఫోన్‌ విశేషాలేంటంటే..

గ్రాఫ్రేనియన్‌ ఓఎస్‌తో..

ప్రైవసీనే ప్రధాన లక్ష్యంగా ‘నైట్రోఫోన్‌ 1’ను తయారుచేశారు. ఈ ఫోన్‌ తయారుచేయడం కోసం గూగుల్‌ పిక్సెల్‌ 4ఏలోని హర్డ్‌వేర్‌ పార్ట్‌ను తీసివేసి ఇతర మేటి సెక్యూర్డ్‌ హర్డ్‌వేర్‌తో రిప్లేస్‌ చేశారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టవ్‌ుకు బదులు గ్రాఫ్రేనియన్‌ ఓఎస్‌ను ఉపయోగించారు. దీంతో గూగుల్‌కు సంబంధించిన మ్యాప్స్‌, ఫోటోస్‌ వంటి యాప్స్‌కు డీఫాల్ట్‌ యాక్సెస్‌ ఉండదు. స్పైవేర్‌ దాడులూ ఉండబోవు. ఆన్‌లైన్‌లో సురక్షితమైన బ్రౌజింగ్‌ కోసం అత్యంత శక్తివంతమైన వెర్షన్‌ క్రోమియం బ్రౌజర్‌ను వాడారు. దీంతోపాటు ఆండ్రాయిడ్‌ కెర్నల్‌, వెబ్‌వ్యూ, కంపైలర్‌ టూల్‌చైన్‌, ఫైల్‌ సిస్టవ్‌ు యాక్సెస్‌ వంటి సమర్థవంతమైన వెర్షన్లతో ఈ ఫోన్‌ నడుస్తుంది. ప్రైవసీని మెరుగుపరచడానికి ఇంటర్‌ఫేస్‌ మెరుగుదల కోసం ఆటోమేటెడ్‌ షట్‌డౌన్‌ సిస్టం కూడా ఉన్నది. ఫోన్‌ ఐఎంఈఐ, సీరియల్‌ నంబర్‌, సిమ్‌ కార్డు సీరియల్‌ నంబర్‌, సబ్‌స్ర్కైబర్‌ ఐడీ, మ్యాక్‌ చిరునామాను హ్యాకర్లు డిటెక్ట్‌ చేయకుండా ప్రత్యేక రక్షణ ఉంది. ఫోన్‌ ధర. రూ.54,700.

ఫీచర్లు ఏమిటంటే?

5.81 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ ఫ్లాష్‌ డ్రైవ్‌, 12.2 ఎంపీ మెయిన్‌ కెమెరా, హెచ్‌డీ ఫ్రంట్‌ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌.

Recent

- Advertisment -spot_img