Homeఫ్లాష్ ఫ్లాష్సాగర్​ వద్ద హై టెన్షన్​

సాగర్​ వద్ద హై టెన్షన్​

– కొనసాగుతున్న పోలీసు పహారా
– 1200 మంది ఏపీ పోలీసుల మోహరింపు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నాగార్జున సాగర్​ వద్ద హై టెన్షన్​ కొనసాగుతోంది. ఏపీకి చెందిన దాదాపు 1200 మంది పోలీసులు మోహరించారు. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. తెలంగాణ పోలీసులు సైతం భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకున్నది.

ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?

ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారనని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేంటీ వివాదం?

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి.

Recent

- Advertisment -spot_img