ఎంతమందిని కాపాడారు?
- వరదలు వస్తుంటే ఏం చేస్తున్నారు?
- కంట్రోల్ రూమ్ ఎక్కడ?
- తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
ఇదేనిజం, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి రాష్ట్ర హైకోర్టు ఫైర్ అయ్యింది. రాష్ట్రంలో విపరీతంగా వరద వస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కంట్రోల్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నికల నిర్వహణ కోసం వార్ రూమ్ లు ఏర్పాటు చేశారు గానీ.. వరదల నిర్వహణ కోసం కంట్రోల్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. వరదలు ఈ స్థాయిలో వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారని నిలదీశారు. వరద బాధితులకు తక్షణం సాయం చేయాలని హైకోర్టు సూచించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతమందిని కాపాడిందని హైకోర్టు ప్రశ్నించింది. వరదలపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నదో.. సోమవారం వరకు వరకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.