Homeఫ్లాష్ ఫ్లాష్#Oxygen : ఈ మొక్కలతో ఇంట్లో ఆక్సిజ‌న్ పెంచుకోండి

#Oxygen : ఈ మొక్కలతో ఇంట్లో ఆక్సిజ‌న్ పెంచుకోండి

Air purifier plants | సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే.

దీంతో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్‌ ( Oxygen ) దొరికేలా చూసుకుంటున్నారు.

ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు.

ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.

సెకండ్‌ వేవ్‌ ( Second wave ) లో కరోనా ( Corona ) విజృంభించి ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు.

ఇలా కొవిడ్‌ ( COVID-19) నేర్పిన పాఠంతో ఎయిర్‌ ప్యూరిఫై మొక్కల ( air purifier plants ) పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.

కొనుగోలు చేసేందుకు నర్సరీల వైపు పరుగులు పెడుతున్నారు.

మరోవైపు వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ నిర్వాహకులు సైతం అనేక మొక్కలను సిద్ధం చేస్తున్నారు.

రూ.50 నుంచి రూ.500ల వరకు అమ్ముతున్నారు.

ఆక్సిజన్‌ ( Oxygen ) ఎక్కువగా అందించే మొక్కలు..

సాధారణంగా మొక్కలన్నీ గాలిలోని కార్బన్‌ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి.

అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్‌ మొక్కలంటే ఏమిటనే సందేహం రావచ్చు.

కానీ అన్ని మొక్కలు ఒకేస్థాయి, ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు.

అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్‌, రాత్రిపూట కార్బన్‌ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి.

అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్‌ పరిమాణం చాలా తక్కువ.

కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి.

మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి.

వీటినే పర్యావరణ ప్రేమికులు, బయాలజిస్టులు ఆక్సిజన్‌ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిలో కొన్ని మీ కోసం..

వీపింగ్‌ ఫిగ్‌ ( weeping fig )

ఇది ఫైకస్‌ రకానికి చెందిన మొక్క. నాసా గుర్తించిన ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క.

ఇంటి పరిసరాల్లో ఉన్న ఫార్మాల్డిహైడ్‌, జైలిన్‌, టౌలిన్‌ తదితర కాలుష్యకారక వాయువులను సైతం పీల్చుకుంటుంది.

మనీప్లాంట్‌ ( Money Plant )

దీనిని సాధారణంగా పోథోస్‌ ప్లాంట్‌ అని కూడా అలంకరణ మొక్కగా కూడా ప్రసిద్ధి పొందింది.

దీనిని ప్రత్యేకత ఏమిటంటే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

స్పైడర్‌ ప్లాంట్‌ ( Spider Plant )

ఇండోర్‌ ప్లాంట్‌గా ఎక్కువగా ప్రసిద్ధి. ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది.

ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్ర ఒత్తిడిని సైతం పోగొడుతుంది.

అరెకా ఫామ్‌ ( Areca palm )

ఈ మొక్క ప్రత్యేకతలెన్నో. చక్కటి ఇండోర్‌ ప్లాంట్‌. కార్బన్‌ డైయాక్సైడ్‌నే గాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది.

గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ ( Oxygen )ను విడుదల చేస్తుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

జెర్బారా డైసీ Gerbera Daisy

ఇవి అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల పుష్పాలను వేడుకల్లో అలంకరణ కోసం వినియోగిస్తుంటారు.

అంతే కాదు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కార్బన్‌తో పాటు ఇతర ప్రమాదకర కాలుష్యకార వాయువులను సైతం ఇది పీల్చుకుని పరిసరాలను శుద్ధి చేస్తుంది.

స్నేక్‌ ప్లాంట్‌ Snake Plant

నాసా గుర్తించిన మరో ఎయిర్‌ ప్యూరిఫైయింగ్‌ మొక్క ఇది. అంతేగాక ఎక్కువ మంది ప్రేమించే మొక్క. ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది.

కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్‌, బెంజిన్‌, జైలిన్‌ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్‌, నైట్రోజన్‌ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది.

తులసి ( Tulsi )

భారతీయతకు తులసి మొక్కకు ఉన్న సంబంధం ప్రాచీనమైనది. అదీగాక అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న మొక్క ఇది.

అందుకే దీనిని క్వీన్‌ ఆఫ్‌ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది.

అదేవిధంగా కార్బన్‌ డై యాక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, సల్ఫర్‌ డై యాక్సైడ్‌ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.

Recent

- Advertisment -spot_img