తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా భీమారంలో నిన్న 47.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. భద్రాద్రి (47.1°C), పెద్దపల్లి (46.7°C), కుమురంభీం (46.6°C), ఖమ్మం (46.5°C)లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో 43°C ఉష్ణోగ్రత నమోదైంది. మరో 3 రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత వేడి తగ్గే అవకాశం ఉందని ఆమె తెలిపారు.