HomeతెలంగాణHimanshu Rao: రక్తి కట్టని ‘హిమాన్ష్​’ డ్రామా.. ఎదురుతన్నిన కేసీఆర్ మనవడి కామెంట్స్​

Himanshu Rao: రక్తి కట్టని ‘హిమాన్ష్​’ డ్రామా.. ఎదురుతన్నిన కేసీఆర్ మనవడి కామెంట్స్​



– రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితి ఇదేనంటూ కౌంటర్స్​
– విపక్షాలు, ఏపీ మంత్రి నుంచి సైతం విమర్శలు
– కేశవనగర్​ స్కూల్​ ఎపిసోడ్​ బూమరాంగ్​

Himanshu Rao: ఇదేనిజం, స్టేట్​ బ్యూరో: కల్వకుంట్ల హిమాన్ష్ రావు​ (himansh) స్పీచ్​ బూమరాంగ్​ అయ్యింది. హిమాన్ష్​ కు ఎలివేషన్లు ఇద్దామని.. కేసీఆర్​ కుటుంబానికి పొలిటికల్​ మైలేజ్​ తీసుకొస్తుందని కేశవ్​ నగర్​ స్కూల్​ ఎపిసోడ్​ ను బీఆర్ ఎస్​ (brs) పెద్దలు ప్లాన్​ చేస్తే.. ఆ వ్యవహారం మొత్తం రివర్స్​ అయ్యింది.

ఈ వ్యవహారం కేసీఆర్ ఫ్యామిలీకి పొలిటికల్​ మైలేజ్​ తీసుకొచ్చిందో లేదో తెలియదు గానీ .. కేసీఆర్​ ప్రభుత్వంపై విమర్శలకు దారి తీసింది. కల్వకుంట్ల హిమాన్ష్​ రూ. 90 లక్షల దాకా సేకరించి కేశవ నగర్​ ప్రభుత్వ పాఠశాలను బాగుచేసిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్​ (hyderabad) శివారులోని ఆ బడి పరిస్థితి అలా ఉంటే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఏంటి? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సీఎం కేసీఆర్​ (kcr) మనవడు, కేటీఆర్​ తనయుడు కల్వకుంట్ల హిమాన్ష్​ రావు హైదరాబాద్​ లోని కేశవనగర్​ ప్రభుత్వ పాఠశాలలో ఇచ్చిన స్పీచ్​ మీదే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హిమాన్ష్​ అద్భుతంగా మాట్లాడాడని బీఆర్ఎస్​ శ్రేణులు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఫ్యూచర్​ లీడర్​ ఆయనేనంటూ పొగుడుతున్నారు. హిమాన్ష్​ చొరవ తీసుకొని కేశవనగరలో ఉన్న ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చాడు. భారీగా డబ్బు ఖర్చుపెట్టి బడి స్వరూపం మార్చాడు. పుట్టినరోజు వేడుకను ఆ బడిలో జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హిమాన్ష్​ ఇచ్చిన స్పీచ్​ వైరల్​ గా మారింది.

ఎలివేషన్​ ఇచ్చేందుకు ట్రైనింగ్​?
హిమాన్ష్​ కు పొలిటికల్​ ఎలివేషన్​ ఇచ్చేందుకే పక్కా ప్లాన్​ తో ఈ పాఠశాల ఎపిసోడ్​ రూపొందించారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ హిమాన్ష్​ కూడా గుక్క తిప్పుకోకుండా బాగానే మాట్లాడాడు. కానీ హిమాన్ష్​ మాట్లాడిన మాటలు సీఎం కేసీఆర్​ ప్రభుత్వానికి నష్టం తెచ్చి పెట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వ బడులు బాగాలేవని.. మీడియాలో కథనాలు వస్తే.. లేదంటే విపక్షాలు విమర్శలు గుప్పిస్తే కచ్చితంగా ప్రభుత్వం ఖండిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ బడులు గొప్పగా ఉన్నాయని కౌంటర్​ ఇస్తుంది.

కానీ ఇప్పుడు ఏకంగా సీఎం మనవడే గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలోని ఓ పాఠశాల దుస్థితిని చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం విశ్వనగరంగా ప్రమోట్​ చేసే హైదరాబాద్​ లోని ప్రభుత్వ బడి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మారుమూల జిల్లాలు, అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది.

విపక్షాలకు ఆయుధం
ప్రస్తుతం హిమాన్ష్​ వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధంగా దొరికాయి. మీ మనవడే బడులు బాగా లేవని చెప్పాడు.. ఇకనైనా పాఠశాలలను బాగు చేయండి అంటూ కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్క కేశవ్​ నగర్​ బడే కాదు.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల పరిస్థితి ఇలాగే ఉంది.. వీటిని ఎప్పుడు బాగుచేస్తారు.. అంటూ ప్రశ్నిస్తున్నారు. హిమాన్ష్​ స్పీచ్​ ముఖ్యమంత్రి కేసీఆర్​ కు ఎదురుతన్నింది. తొమ్మిదేండ్లు పాలించిన సీఎం కేసీఆర్​ బడుల పరిస్థితిని పట్టించుకోలేదు అనేందుకు మనవడి వ్యాఖ్యలే నిదర్శనం అంటూ విమర్శలు వస్తున్నాయి.

గత రెండ్రోజులుగా రేవంత్​ రెడ్డి (revanth reddy) ఉచిత విద్యుత్​ మీద చేసిన కామెంట్లు దుమారం రేపాయి. నిన్నటివరకు వరస ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. కానీ తాజాగా హిమాన్ష్​ కామెంట్స్​ తో రేవంత్​ అంశం తెరమరుగైంది. మనవడికి ఎలివేషన్​ ఇద్దామని భవిష్యత్​ లో మంచి లీడర్​ గా ప్రొజెక్ట్​ చేద్దామని భావిస్తే.. మొత్తం వ్యవహారం ఎదురుతన్నడంతో కేసీఆర్​ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్​ ఏం చేయబోతున్నారో.. వేచి చూడాలి.

హిమాన్ష్ వెంట యాదాద్రి అర్చకులెందుకు?
నిన్నటి హిమాన్ష్​ పర్యటనపై మరో విమర్శ కూడా వస్తోంది. హిమాన్ష్​ ను ఆశీర్వదించేందుకు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అర్చక బృందం రావడం.. ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు , ఇతర అర్చకులు నేరుగా ప్రగతి భవన్​ కు వెళ్లి హిమాన్ష్ కు వేదాశీర్వచనం అందజేయడం ఏమిటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సహజంగా రాష్ట్రపతి, గవర్నర్​, ముఖ్యమంత్రి లేదా దేవాదాయశాఖ మంత్రి వచ్చినప్పుడు యాదాద్రి అర్చకబృందం వెళ్తుంది. కానీ హిమాన్ష్​ ను ఏ హోదాలో ఆశీర్వదించారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కేశవ్​ నగర్​ స్కూల్​ కు వెళ్లిన హిమాన్ష్​ కు మంత్రి సబిత, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ ఎదురెళ్లి స్వాగతం పలకడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img