చెన్నైః తమిళనాడులో హిందీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ఉద్యమం మొదలైంది. కొందరు సినీ సెలబ్రిటీలు, యువత ;హిందీ తెలియదు పోరా; అంటూ టీషర్టులతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే పనిలో పడ్డారు. అదే సమయంలో హిందీ నేర్చుకుంటే ;తమిళం కాదు, డీఎంకే అడ్రస్సే గల్లంతు; అంటూ బీజేపీ యువత ఎదురు దాడికి దిగడం రెండు పార్టీల మధ్య వార్‌ని రాజేసింది.
సినీ సెలబ్రిటీలు యువన్ శంకర్‌రాజ, ఐశ్వర్య రాజేష్, శాంతను తదితరులు పరో క్షంగా, ప్రత్యక్షంగా హిందీ వ్యతిరేక నినాదాలతో టీ షర్టులు ధరించి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ‘హిందీ తెలియదు పోరా, నేను తమిళం మాట్లాడే భారతీయుడిని’ అన్న నినాదాలు ఉన్న టీషర్టులు ధరించి తమ ఫొటోలను పోస్టు చేస్తున్నారు. డీఎంకే యువజన నేత, నటుడు ఉదయ నిధి సారథ్యంలో టీ షర్టుల హిందీ వ్యతిరేక ఉద్యమం మరింత ఊపందుకుంది. డీఎంకే ఎంపీ కనిమొళితో కొందరు యువకులు హిందీ వ్యతిరేక నినాద టీషర్టులు ధరించి సామాజి క మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
కేంద్రం త్రి భాషా విధానంతో హిందీ, సంస్కృతంను బలవంతంగా రుద్దే యత్నం చేస్తున్నట్టు తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం చట్టాన్ని పాలకులే కాదు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల వేదికగా ఓ ఉద్యమం బయలుదేరడం గమనార్హం.
తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య ‘హిందీ’ వార్
RELATED ARTICLES