ఇదే నిజం,గొల్లపల్లి : గొల్లపెల్లి మండల కేంద్రంలో హిందూ జన జాగృతి కొరకై చేపడుతున్నటువంటి సనాతన ధర్మ రథయాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా గోరక్షక్ ప్రముఖ్ ఆడెపు నరేష్ మాట్లాడుతూ హిందువుల అందరినీ మతం మార్చి హిందూ ధర్మాన్ని సర్వనాశనము చేయడానికి అనేక విధాల కుతంత్రాలు చేస్తున్నారు.హిందువుల అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని బీదరీకాన్ని బలహీనతల్ని అనారోగ్యాన్ని అవసరాల్ని ఆసరా చేసుకొని మతం మార్చుతున్నారు.కావున హిందూ ధర్మ జాగరణ రథయాత్ర ద్వారా హిందువులందరినీ ఏకధాటిగా తీసుకురావడానికి గ్రామ గ్రామాన హిందూ రథయాత్ర చేయడం జరుగుతుంది.అందులో భాగంగా శుక్రవారం రోజునా రథయాత్ర చేయడం జరుగుతుంది.కావున హిందూ బాందవులు ఈ యొక్క రథయాత్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మండల అధ్యక్షులు కుంబార్కర్ అరుణ్,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్,విశ్వహిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు అంకం సతీష్,బజరంగ్దళ్ మండల కన్వీనర్ ఎనగందుల రమేష్,మాటూరి విజయ్,బ్రాహ్మచారి,అజయ్,రాహుల్,తదితరులు పాల్గొన్నారు.