Holi: ఉత్తరప్రదేశ్ లోని ఎటావాలోని ‘సౌతానా’ గ్రామంలో తేలుతో హోలీ ఆడటం అనే వింత సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడ, ‘ఫాగ్’ చప్పుడు వినగానే, వందలాది తేళ్లు వాటి రంధ్రాలనుంచి బయటకు వస్తాయి. గ్రామంలోని ప్రతిఒక్కరూ వాటిని తమ చేతుల్లోకి తీసుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటారు. తేళ్లు ఈ పవిత్రమైన రోజున కుట్టవని గ్రామస్తులు నమ్ముతారు. ఈ తేళ్లు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు చెప్పడానికి వస్తాయని వారు విశ్వసిస్తారు.