– ఎస్పీ కిరణ్ ఖరే
ఇదేనిజం, భూపాలపల్లి ప్రతినిధి : జిల్లా ప్రజలు హోలీ (Holi) పడుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. హోలీ పండుగను పురస్కరించుకొని ప్రజలకు పోలీసు శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సాంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించుకోవాలన్నారు. ముఖ్యంగా యువత మద్యం సేవించి వాహనాలను నడపడం చేయడం నేరమన్నారు. జిల్లా ప్రజలు సురక్షితమైన సహజ రంగులను వాడి పండుగను నిర్వహించుకోవాలని, రసాయన రంగులను ఉపయోగించొద్దన్నారు. యువత హోలీ పండుగ అనంతరం చెరువుల్లో లోతట్టు ప్రాంతాల్లో స్నానాలు ఆచరించే క్రమంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని సూచించారు. ముఖ్యంగా యువత తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ వారికి సరైన పద్ధతిని తెలియజేయాలని సూచించారు. వాహనాలు నడిపే క్రమంలో అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్ వంటివి మానుకోవాలని, తెలియని వారిపై రంగులు చల్లవద్దని ఎస్పీ కిరణ్ ఖరే సూచించారు.