– ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి
ఇదే నిజం, హైదరాబాద్: వచ్చే ఏడాదికి గాను సాధారణ, ఆప్షనల్ హాలీడేస్ జాబితాను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్ హాలీడేస్ ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10న రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
జనవరి: 1వతేదీ ( న్యూ ఇయర్), 14 (భోగి), 15 (సంక్రాంతి), 26 (రిపబ్లిక్ డే)
మార్చి: 8వతేదీ (మహాశివరాత్రి), 25(హోలీ), 29 (గుడ్ ఫ్రైడే)
ఏప్రిల్: 5వ తేదీ (బాబు జగ్జీవన్ రాం జయంతి), 9(ఉగాది), 11,12 (రంజాన్), 14 (అంబేద్కర్ జయంతి), 17(శ్రీరామ నవమి)
జూన్: 17వ తేదీ (బక్రీద్)
జులై: 17వ తేదీ (మొహర్రం), 29 (బోనాలు)
ఆగస్ట్: 15వ తేదీ (ఇండిపెండెన్స్ డే), 26 (శ్రీకృష్ణాష్టమి)
సెప్టెంబర్: 7వ తేదీ (వినాయక చవితి), 16 ( మిలాద్ ఉన్ నబీ)
అక్టోబర్ : 2వ తేదీ (గాంధీ జయంతి), 12, 13 (విజయదశమి), 24 (దీపావళి)
నవంబర్ : 25వ తేదీ (గురునానక్ జయంతి), 25, 26 (క్రిస్మస్)
ఆప్షనల్ హాలీడేస్
జనవరి 16 (కనుమ), జనవరి 25 (హజ్రత్ అలీ బర్త్ డే), ఫిబ్రవరి 8 (షబ్ ఈ మిరాజ్), ఫిబ్రవరి 14 (శ్రీ పంచమి), ఫిబ్రవరి 26 (షబ్ ఈ బరత్), మార్చి 31 (షహదత్ హజత్ అలీ), ఏప్రిల్ 7 (షబ్ ఈ ఖదర్), ఏప్రిల్ 14 (తమిళ్ న్యూ ఇయర్స్ డే), ఏప్రిల్ 21 (మహావీర్ జయంతి), మే 10 (బసవ జయంతి), మే 23 (బుద్ధ పూర్ణిమ), జూన్ 25 (ఈద్ ఇ ఘదీర్), జూలై 7 (రత్నయాత్ర), జూలై 16 (మొహర్రం), ఆగస్టు 16 (వరలక్ష్మీ వ్రతం), ఆగస్టు 19 (శ్రావణ పూర్ణిమ) , అక్టోబర్ 10 (దుర్గాష్టమి), అక్టోబర్ 11 (మహార్నవమి), అక్టోబర్ 30 (నరక చతుర్ది), నవంబర్ 16 (సయ్యద్ మహమ్మద్ జువాన్‌పురి మహదీ జయంతి)