Homeహైదరాబాద్latest Newsరాజమౌళి – మహేశ్​ మూవీలో హాలీవుడ్​ నటి?

రాజమౌళి – మహేశ్​ మూవీలో హాలీవుడ్​ నటి?

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన ఒక్కో సినిమాకు మధ్య ఏండ్ల తరబడి గ్యాప్​ తీసుకున్నా.. వచ్చే అవుట్​ పుట్ కూడా అదే రేంజ్​లో ఉంటుంది. ఇక కథ విషయంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్​ అవ్వడు. మగధీర – బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో రాజమౌళి క్రేజ్ వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. ఈసారి మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. మహేష్ సినిమా కోసం రాజమౌళి కొత్త కాంబోలు ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని గతంలోనే రాజమౌళి చెప్పారు. ఈ సినిమాకోసం ఏకంగా 3 ఏండ్లు మహేష్ డేట్స్ అడిగినట్టు సమాచారం. ఇక గత రెండు రోజులుగా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ భామ రాజమౌళి – మహేష్ ప్రాజెక్ట్ లో భాగం కానుందని వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి. ఇక తాజాగా మహేష్ – రాజమౌళి సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ పేర్లు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా రాజమౌళి అన్ని సినిమాలకు చాలా వరకు ఒకే టీం టెక్నిషియన్స్ ఉంటారు. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్, యాక్షన్ కొరియోగ్రాఫర్.. ఇలా చాలా మంది టెక్నిషియన్స్ రాజమౌళికి రెగ్యులర్ గా పని చేస్తారు.

Recent

- Advertisment -spot_img