Homeఫ్లాష్ ఫ్లాష్ఇంటికీ ఇన్సూరెన్స్​ చేసుకోవచ్చని మీకు తెలుసా..

ఇంటికీ ఇన్సూరెన్స్​ చేసుకోవచ్చని మీకు తెలుసా..

ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాల నుంచి రక్షణ

సొంతిల్లు అంటే అందరికీ ముఖ్యమైనదే. అది కుటుంభంలో భాగంగానే చూస్తాం. అటువంటి ఇంటికి బీమా ఉంటుందని మీకు తెలుసా..

అటువంటి ఇల్లును వరదలు, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు అల్లర్ల ల్లాంటి ఘటనల వల్ల ఎదురయ్యే నష్టాల నుంచి కాపాడుకోడానికి బీమా రక్షణ తప్పనిసరి.

అయితే మనిషి జీవితానికి, వాహనాలకు ఉన్నట్టుగానే మన ఇంటికి కూడా బీమా ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు.

అనుకోని సంఘటనల వల్ల ఇంటికి జరిగే నష్టాలను బీమాతో పూడ్చుకోవచ్చు.

ఒక కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయనప్పుడు ఆ కుటుంబాన్ని జీవిత బీమా రక్షించినట్టుగానే ఇంటికి జరిగే నష్టాన్ని కూడా హోమ్‌ ఇన్సూరెన్స్‌ ద్వారా భర్తీ చేసుకోవచ్చు.

హోమ్‌ ఇన్సూరెన్స్‌ ఇల్లుకు, ఇంట్లో ఉండే విలువైన వస్తువులకు కూడా భద్రత కల్పిస్తుంది.

అంతే కాదు ఇంట్లో ఉండే బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులకు కూడా హోమ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు.

అద్దె ఇంటికీ బీమా?

ఇండ్లకు ఇన్సూరెన్స్‌ తీసుకునేందుకు అద్దెకు ఉన్న వారికి అర్హత ఉండదు. కానీ అద్దె ఇంట్లో కూడా విలువైన వస్తువులకు హోమ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు.

ఇక పూర్తి వివరాలకు మీకు నచ్చిన బీమా ఏజెంట్​ను గానీ, బీమా ఆఫీసులో గానీ సంప్రదించండి.

అలాగే ఎటువంటి పరిస్థితుల్లో బీమా వర్తించదో తప్పక అడిగి తెలుసుకోండి.

Recent

- Advertisment -spot_img