ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు నెలల కూటమి ప్రభుత్వంలో క్రైం రేటు చాలా తక్కువగా ఉందిని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.దిశ యాప్, చట్టం పనిచేస్తుంటే మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలేసి.. లేని దిశా చట్టం కింద కేసులు పెట్టారా.. అని అనిత ప్రశ్నించారు. అయితే హోంమంత్రి అనిత వ్యాఖ్యలను వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు విఫలమయ్యాయని వైసీపీ నినాదాలు చేసింది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కారణంతోనే నీలాంటి వారు సభకు వస్తున్నారని అనిత అన్నారు.