హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త ఎస్‌పీ 125 2025ను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధరను రూ.91,771గా నిర్ణయించింది. ఇది డ్రమ్ వేరియంట్ ధర. ఇందులోనే డిస్క్ వేరియంట్ ధరను రూ.1లక్షగా నిర్ణయించింది. కొత్తగా బ్లూటూత్ కనెక్టివిటీ సౌకర్యంతో కూడిన 4.2అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇచ్చారు. మొబైల్ ఛార్జింగ్ కోసం టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా జోడించారు.