ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్, ఆయన భార్య మెలిండా మధ్య విభేదాలు రావడానికి, వివాహబంధం నుంచి విడిపోవడానికి చైనాకు చెందిన షీ షెల్లీ వాంగ్‌నే కారణం అని వదంతులు వెల్లువెత్తుతున్నాయి.
వాంగ్, బిల్‌గేట్స్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నదని అందువల్లే మెలిండా విడాకులు తీసుకొంటున్నారని ఆ వదంతుల సారాంశం. వాంగ్ వయస్సు 36 ఏండ్లు.
గేట్స్ ఫౌండేషన్‌లో అనువాదకురాలిగా పనిచేస్తున్నారు. ఇంకా పెండ్లి కాలేదు. ఈ వదంతులను ఆమె ఖండించారు.
వాంగ్‌పై ఎవరు ఎందుకు వదంతులు వ్యాపింపజేశారన్నది తెలియలేదు.
దీంతో పాటు ప్రపంచ ప్రముఖులకు చైనా మహిళలతో హానీ ట్రాప్ చేయిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్బర్గ్ భార్య కూడా చైనా మహిళనే.
అలాగే ఈ మద్య బిల్‌గేట్స్ భారత్ వంటి దేశాలకు వ్యాక్సిన్ ఫార్ములా చెప్పొద్దని అనడం తెలిసిందే..
దీని వెనక కూడా ఆ మహిళ ద్వారా చైనా హస్తం ఉండి ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.