కొందరు ప్రముఖ హీరోయిన్లు సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండగా, నటి కీర్తి సురేష్ పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లకుండా ముంబై వెళ్లిపోయింది. సినిమాపై తనకు ఉన్న ప్యాషన్ చూసి అభిమానులు మెచ్చుకుంటున్నారు. ప్రముఖ డైరెక్టర్ అట్లీ నిర్మించిన, వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘బేబీ జాన్’ క్రిస్మస్ కానుకగా వచ్చే వారం థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే గోవాలో కీర్తి సురేష్ పెళ్లి ఘనంగా జరిగింది. అయితే పెళ్లైన కొన్ని రోజులకే కీర్తి సురేష్ మెడలో తాళితో నిన్న ముంబైలో జరిగిన ‘బేబీ జాన్’ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంది.15 ఏళ్లుగా ప్రేమించిన భర్తతో హనీమూన్‌కి వెళ్లకుండా సినిమా ప్రమోషన్ కోసం కీర్తి సురేష్ వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.