Homeహైదరాబాద్latest Newsబదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మానం

ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో మండల పరిషత్ పాఠశాలలో మాజీ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు ఆధ్వర్యంలో బదిలీ పై వెళుతున్న ఉపాధ్యాయులు బాపురెడ్డి, లక్ష్మణ్ గౌడ్, అంజి రెడ్డి, హసీనా మేడంను సన్మానించారు.
మాజీ సర్పంచ్ కల్వకుంట్ల వనజ మాట్లాడుతూ.. గ్రామ విద్యార్థిని విద్యార్థులను ఉన్నతమైన విద్యను అందించి గురుకుల నవోదయ ఆదర్శ పాఠశాలల్లో సీట్లను సాధించి గ్రామ పాఠశాలల జిల్లా మండల స్థాయిలో నిలిపిన ఉపాధ్యాయులను విద్య సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నారాయనోజు సంధ్య, ప్యాక్స్ వైస్ చైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కల్వకుంట్ల శ్రీనివాసరావు, గ్రామ శాఖ అధ్యక్షులు నారాయనోజు సతీష్, మెరుగు యాదగిరి గౌడ్ (చంద్రలోక్ ), కొట్టురి శేఖర్, పల్లాట్టి మల్లేష్, జంపెల్లి దేవయ్య, కారంపూరి బాబు , వారాల లక్ష్మణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, కరుణ శ్రీ మేడం, ఉపాధ్యాయులు దేవేందర్ రావు, మల్లారెడ్డి, అంగన్వాడి మేడం పల్లాటి భాగ్య, శీలం లత, సుమలత, గీరీష, పాఠశాల చైర్మన్లు మెరుగు జయ శ్రీ, మెరుగు స్రవంతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img