రాశి ఫలాలు :
మేష రాశి:
గ్రహసంచారాలు ఉపకరించగలవు. ప్రయత్నాలు వేగవంతం చేసుకోండి. సంతాన పరంగా ఉత్సాహమునిచ్చు వార్తలుంటాయి. కొత్త పరిచయాలను పెంచుకుంటారు. ఖర్చుల్ని నియంత్రించుకొంటూ పొదుపు చర్యలు తీసుకో గలుగుతారు. ఆత్మీయుల సంఖ్యను పెంచుకోగలరు. వృత్తి, ఉద్యోగాల్లో మంచి ఫలితాలు చూడగలరు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్లానింగ్తో వ్యవహరించుకోవాలి.
వృషభ రాశి:
వ్యక్తిగతంగా ఉత్సాహమును పొందుతారు. ఉద్యోగాల్లో ఆశించిన మార్పులను పొందగలుగుతారు. మానసికంగా కఠినంగా ఇంటా-బయటా వ్యవహరించుకొను సూచనలు గలవు. ఆర్భాటం, పంతాలకు ఎక్కువ విలువనిస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలు అనుకూలం. స్థిరాస్తుల రాశితాకట్టును విడిపించుకోగలరు. వృత్తి, వ్యాపారాల్లో చిన్నతరహా ఆటుపోట్లను ఎదుర్కోవలసిరావచ్చును.
మిధున రాశి:
మిశ్రమ గ్రహసంచారం. ప్రయత్న అనుకూలతలకు పట్టుదలలు చూపుకోవాలి. ఇబ్బందులు ఉండవుకాని, శ్రమ చూప వలసివుంటుంది. నూతన వస్తు, సదుపాయాలను ఏర్పరచుకోగలరు. అంత రంగిక విషయాలకు కుటుంబ వ్యక్తులవద్దకూడా గోప్యంగా ఉంచవలసిరావచ్చు. ఇతరులకు సహాయ సహకారాలు చేయవలసివుంటుంది. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి.
కర్కాటక రాశి:
గ్రహ సంచారాలు సామాన్యంగా ఉన్నాయి. ఆధ్యాత్మికచింతనలతో వ్యవహరించుకొంటారు. పట్టు- విడుపులతో ముఖ్యమైన విషయాల్లో సాగాల్సివుంటుంది. కుటుంబంలో సాధారణతలు కొనసాగుతాయి. ఖర్చులలో జాగ్రత్తలు చూపుకొని బ్యాలెన్స్డ్గా వ్యవహరించుకొంటారు. భ్రాతృ వర్గంతో, తోటివారితో సంయమనాలు అవసరమవుతాయి. ఉద్యోగులు సమయపాలనకు ప్రాధాన్యతనిచ్చుకోవాలి.
సింహం రాశి:
IT వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో సమర్థతను పెంచుకోవాలి. విమర్శలు పెరుగుతాయి. ఎవరితోనూ ఎక్కువగా వ్యవహరించుకో కండి. సంతానపు తీరు అర్థంకానిదిగా ఉంటుంది. ఖర్చులు, అంచనాలను మించుతాయి. అదనపు లబ్ధికై చేయు ప్రయత్నాలను కొంతకాలం వాయిదా వేసుకోండి. ఉన్నత స్థానంలో ఉన్న వివిధ వర్గపు ప్రజలు అధిక జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి.
కన్య రాశి:
ప్రయత్నించుకొన్నవారికి ప్రయోజనములుంటాయి. అవకాశాలు కలసిరాగలవు. సహకరించు వ్యక్తులు పెరుగుతారు. కుటుంబ వ్యక్తులచే చిన్నతరహా మానసిక ఘర్షణలు చోటుచేసుకొంటాయి. ఖర్చులు కొన్ని ఎక్కువ అగుటచే సమర్థించుకోవలసిరావచ్చును. ఇతరుల వ్యాఖ్యానాల్ని పట్టించుకోకుండా అభివృద్ధికై యోచనలు చేసుకోండి. వ్యాపారాలు ఊహించు కొన్నట్లుగా సాగుతాయి.
తుల రాశి:
అనుకూలతలు పెరుగుతాయి. ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్భాటపు వ్యవహారాల్ని చేస్తారు. స్థిరాస్తుల రాశివ్యవహారాలలో నిర్లను లను మార్పు చేసుకొంటారు. కుటుంబ వ్యక్తులకు బహుమతులు ఇవ్వవలసి రావచ్చును. వృత్తి, ఉద్యోగాలు సాధారణ స్థాయిలో సాగుతాయి. కృషి ఫలించగలదు. కొత్త ప్రయత్నాలకు శ్రీకారాలు చుట్టగలుగుతారు.
వృశ్చిక రాశి:
చేపట్టుకొన్న పనులకు జాప్యములు ఎదురవుతాయి. ఆర్ధికంగా సర్దుబాటు అవసరం. గృహ నిర్మాణపు రిపేర్ల పనుల్లో ఒత్తిడిని ఎదుర్కోవలసిరావచ్చు. యంత్రాదుల వాడకంలో జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు ఏర్పడు సూచనలు ఉన్నాయి. శ్రమకు తగిన ప్రయోజనాలు లేక నిరాశకరంగా రోజులు సాగుతాయి.
ధనుస్సు రాశి:
గ్రహసంచారాలు మిశ్రమ ఫలితమిస్తాయి. వ్యవహారాల్ని పూర్తి గా చేసుకొను క్రమంలో ఖర్చులు ఎక్కువ చేయవలసిరావచ్చును. కుటుంబంలో ఏకవాక్యతలకై సర్దుకుపోవలసివుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాసా రాల్లో సామాన్యతలు కొనసాగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యపరంగా జాగ్ర త్తలు అవసరం. ఆలోచనా విధానాల్లో మార్పులుచేసి విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనాలు పొందుతారు.
మకర రాశి:
గ్రహసంచారాలు అనుకూలం. అనుకొన్న పనుల్ని పూర్తిచేసుకొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో మీదైన తరహాను చూప గల్గుతారు. ప్రణాళికారచనలు అమలుచేస్తారు. ఖర్చులు ఎక్కువైనా సంతృప్తిని ఇస్తాయి. నూతన ఒప్పందాలు, కాంట్రాక్టులు చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యక్తుల రాశి తీరులో విసుగుచెందు సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు వ్యాసంగాలు చురుకుగా సాగుతాయి.
కుంభ రాశి:
ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలోచనలు అమలుచేస్తారు. అనుభవాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఖర్చులు ఆదాయాలకు తగినట్లుగా వ్యవహరించుకోగలుగుతారు. దూర ప్రయాణ అవకాశాలు ఏర్పడతాయి. అధికారులనుండి ప్రశంసలు పొందుతారు. బుద్ధిమాంద్యములచే కాలహరణాలుంటాయి. విద్యార్థులు టార్గెట్ విధావాల్ని పాటించుకోవాలి.
మీన రాశి:
అన్నిటా జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. స్థిరమైన ఆలోచనావిధానాలు అమలుచేయండి. వృత్తి, వ్యాపారాలను పట్టుదలలు చూపి పూర్తిచేసుకోవాలి. ఎవ్వరితోను అభిప్రాయభేదాలు ఏర్పడకుండా లౌక్యంగా సాగవలసివుంటుంది. నిత్యకృత్యములనే పట్టుదలలు చూపి వాయిదా వేయకుండా వ్యవహరించుకోవాలి.