Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (02-01-2025, గురువారం)

రాశి ఫలాలు (02-01-2025, గురువారం)

మేషం
ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. తీసుకున్న ఋణములు భారమయ్యే అవకాశముంది. వాగ్వివాదములకు చోటులేకుండా జాగ్రత్తపడాలి.

వృషభం
ఈ రాశి వారు ఈ రోజు అన్నదమ్ముల సహకారం ఉంటుంది. సుఖసంతోషాలకు లోటుండదు. ఆస్తుల విలువలు పెరగడం, రత్నములు మణులు మొదలగు వస్తువులను అమ్మివేయడం వలన ఆదాయం కల్గుతుంది. మిత్రులు బంధువులతో ఆశావహంగా గడుపుతారు.

మిథునం
ఈ రాశి వారికి ఈ రోజు ఇది ఆనందదాయకమైన, అదృష్టవంతమైన కాలం. మీ ప్రయత్నాలలో విజయం పొందుతారు. వ్యాజ్యాల విషయాల్లో కూడా ఉప శమనం కనిపిస్తుంది. మీ స్థితి మరియు సంపాదన కూడా మెరుగుపడుతుంది.

కర్కాటకం
ఈ రాశి వారు ఈ రోజు సహోద్యోగులతో వివాదాలను ఉత్తమంగా తప్పించుకోవాలి. విద్యార్థుల ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చదువు విషయంలో మరింత కృషి మరియు శ్రద్ధ అవసరం కావచ్చు. పెట్టుబడులకు సమయం కాదు.

సింహం
ఈ రాశి వారు ఈ రోజు మీ తోబుట్టువులు మీతో మంచి సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీకు మంచి సామాజిక జీవితం ఉంటుంది. మీరు సంగీతం, కళలు మొదలైన సృజనాత్మక విషయాలలో సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంది.

కన్య
ఈ రాశి వారికి ఈ రోజు అధికారం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తుంది. భౌతికసుఖాలను, విలాసాలను అనుభవిస్తారు. మీరు కొత్త స్నేహితులను కూడా సంపాదించుకుంటారు మరియు ఆనందకరమైన జీవనశైలితో జీవనంలో ముందుకు సాగుతారు.

తుల
ఈ రాశి వారు ఈ రోజు విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకుని, వక్తృత్వపు పోటీల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయం సాధిస్తారు. వ్యవసాయ దారులకు అధికదిగుబడుల వలన ఆదాయం, అన్ని వృత్తుల వారికి సమృద్ధి.

వృశ్చికం
ఈ రాశి వారు ఈ రోజు ధనం నిల్వచేస్తారు. కళత్ర పుత్రులతో సుఖజీవనం. కుటుంబ వాతావరణం బాగుం టుంది. తోబుట్టువులతో సత్సంబంధాలు బాగుంటుంది.

ధనుస్సు
దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. మార్గావరోధాలు కల్గుతాయి. ఫ్లూ జ్వరాలు, కండరముల నొప్పులు వంటి ఆరోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంది.

మకరం
ఈ రాశి వారికి ఈ రోజు వ్యవసాయదారులకు కలసివచ్చే సమయం. శత్రువులపై జయం. వృత్తి ఉద్యోగాలలో గౌరవం, ఆర్థిక పరిపుష్టి, కుటుంబవృద్ధి అవుతుంది. వ్యాపారాలలో ముందంజ, ఆర్థికలాభాలు వస్తాయి.

కుంభం
ఈ రాశి వారికి ఈ రోజు అభివృద్ధి మరియు లాభాలను పొందే శుభ తరుణం ఇది. ఈ కాలంలోనే ఉద్యోగ విషయంలో ఉన్నతి అంటే ప్రమోషన్ మరియు జీతం పెంపు కల్గుతుంది. కొత్త అవకాశాలను పొందుతారు.

మీనం
ఈ రాశి వారికి ఈ రోజు స్నేహితుల నుండి మద్దతు మరియు అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు. సంపద వృద్ధిని సూచిస్తోంది. ఆర్థికసమస్యల నుండి బయటపడతారు. సమాజంలో మెరుగైన స్థానం మరియు ఆనందాన్ని అనుభవించే సమయం.

Recent

- Advertisment -spot_img