Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (03-04-2025, గురువారం)

రాశి ఫలాలు (03-04-2025, గురువారం)

రాశి ఫలాలు (03-04-2025, గురువారం)

మేష రాశి
మేష రాశి వారు మార్కెటింగ్ డిపార్టుమెంట్లో ఉన్నవారికి మంచి లాభాలను అందుకోగలుగుతారు. మీ ప్రతిభను మీ పై అధికారులు గుర్తిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారు కాలం అనుకూలంగా ఉంటుంది. ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి. మంచి అవకాశాలను అందుకోగలరు.

వృషభ రాశి
వృషభ రాశి వారు తల్లి తరుపు బంధువులుతో మనస్పర్ధలు రాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకుంటారు. దూరప్రాంతాల నుంచి విశేషమైన శుభవార్తలు వినగలుగుతారు మీ ఇష్టదేవుళ్లకు మహా తీర్ధం పొడితో అభిషేకం చేయడండి. మీరు సహాయపడిన వారు సహాయం చేయాలి కానీ సహాయ పడవలసిన సమయంలో మాత్రం వాళ్లు అందుబాటులో ఉండరు.

మిథున రాశి
మిథున రాశి వారు శుభకార్యాలకు సంబంధించిన విషయాలలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఎవరిని నమ్మి పని భారం వదిలేయవద్దు. కష్టమో నష్టమో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. సహోద్యోగులతో మామూలుగానే వ్యవహరించినప్పటికీ ఉన్నతాధికారుల దృష్టిలో మాత్రం మీరు మంతనాలు జరుపుతున్నట్లు గానే వారికి అభిప్రాయం కలుగుతుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుటుంబ సహాయ సహకారాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులలో ఒంటి చేత్తో ఇంటిని లాగలేకపోతున్న విషయాలు వాళ్ళు గ్రహించుకుంటారు. శ్రీ లక్ష్మి చందనంతో సుబ్రమణ్య స్వామివారికి అభిషేకం జరిపించండి. ఈ రాశి వారు ఈరోజు నూతన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు.

సింహ రాశి
సింహ రాశి వారు తండ్రి నుండి ఆశిస్తున్న ఆస్తి సంబంధిత విలువైన పత్రాలు చేతి దాకా వచ్చి చేయిజార్చుకుంటారు. మళ్లీ గొడవలు మొదటి నుంచి ప్రారంభమయ్యే దిశలో పయనిస్తాయి. మహా పాశుపత కంకణం ధరించండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆహార పానీయాల పట్ల ఖచ్చితమైన శ్రద్ద వహించండి.

కన్య రాశి
కన్య రాశి వారి పేరు మీదున్న సంస్థలుకు మంచి పేరు లభిస్తుంది. మీ మాటకు విలువిచ్చి కొంతమంది వారి జీవితంలో మంచి మార్పు తీసుకురావడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల తీవ్రంగా ప్రతిస్పందిస్తారు.

తుల రాశి
తుల రాశి వారికి కొంతమంది వ్యక్తుల పట్ల మీకు ప్రేమ ఉన్నప్పటికీ వాళ్ల ప్రవర్తన నచ్చదు. వాళ్ళ వైఖరిలో మార్పులు రావాలని మీరు ఎంతగానో విశ్వసిస్తారు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి. దూరప్రాంత ప్రయాణాలు వాహన సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు అధునాతన సాంకేతిక పరికరాల పట్ల ఆకర్షితులవుతారు. వాటి గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలన్న అభిలాష కలిగి ఉంటారు. ఎంత ఇష్టం లేనప్పటికీ కొన్ని బాధ్యతలు మాత్రం సక్రమంగా మీ బాధ్యత నిర్వహిస్తారు. పక్షులకి ఆహారం వేయండి. మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు. కళా రంగంలో ఉన్నవారు సినీ రంగాల్లో ఉన్నవారు మంచి అవకాశాల కోసం విస్తృత ప్రయత్నాలను కొనసాగిస్తారు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు చిన్న పెద్ద ఏ అవకాశం వచ్చినప్పటికీ వాటిని సద్వినియోగ పరచుకోండి. భవిష్యత్తు బాగుంటుంది. అనివార్య దూర ప్రాంత ప్రయాణాలు, చిన్నపిల్లల ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. పక్షులకి నీళ్లని పెట్టండి. ఎన్నో విషయాల గురించి అవగాహన ఉండి కూడా మనం తప్పటడుగు వేయకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రకాలైన సమస్యలను అధి గమించడానికి దైవచింతన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

మకర రాశి
మకర రాశి వారు పిల్లల్ని కొన్ని విషయాలలో ప్రోత్సహించి కొన్ని విషయాలలో మందలిస్తారు. దూరప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు దైవదర్శనాలు చేసుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత కోసం వెంపర్లాడతారు. సౌర కంకణాన్ని ధరించండి ఆరోగ్యం మెరుగు పడుతుంది. సహోదర సహోదరీ వర్గంతో నాలుగు అడుగులు దూరంగా ఉండాలని గట్టి నిర్ణయం తీసుకుంటారు.

కుంభ రాశి
కుంభ రాశి వారు చేస్తున్న వ్యాపారాలలో స్వల్ప మైన మార్పులు చేయగలరు. మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఎంత ఆదాయం సమకూరినప్పటికీ ఖర్చులు అంతకంతకు పెరుగుతూ ఉంటాయి ఇది అంతుచిక్కని సమస్యగా పరిణమిస్తుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి.

మీన రాశి
మీన రాశి వారు ఎగుమతి, దిగుమతి వ్యాపారాలలో అడుగు పెట్టాలన్న ఆలోచన బలంగా ముడిపడతాయి. కొంతమంది పరిచయాలు ద్వారా మంచి విషయాలు గ్రహించుకోగలుగుతారు. స్వార్థం లేకుండా ఎంతో కాలంగా మీరు చేస్తున్న సేవలు పనులకు గాను మంచి గుర్తింపు లభిస్తుంది. అష్టమూలిక తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. పరిచయాలు పెంచుకుంటారు.

Recent

- Advertisment -spot_img