రాశి ఫలాలు (04-04-2025, శుక్రవారం)
మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. చక్కని ప్రణాళికతో పనిచేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. బాధ్యతల నిర్వహణలో తడబాటు వద్దు. మానసిక ప్రశాంతత అవసరం. ధనదాన్య వృద్ధి ఉంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచుకుంటారు. ఆత్మీయుల సహకారం లబిస్తుంది. శ్రీమహాలక్ష్మిని ధ్యానించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి అదృష్టయోగం సూచితం. పరిస్థితులకు తగినట్టు స్పందించండి. ఆర్ధిక వ్యవహారాల్లో నిజాయతీగా వ్యవహరించండి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెద్దల ప్రశంసలు అందుకుంటారు. శుక్రుడి ప్రభావంతో వ్యాపారం లాభదాయకం అవుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.
మిథున రాశి
మిథున రాశి వారు మనోబలంతో పనులను ప్రారంభించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి కొత్త ప్రణాళికలు రచించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. అవరోధాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. మంచి వార్త వింటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి దైవబలం నడిపిస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఏ విషయంలోనూ చంచలత్వం వద్దు. స్థిరంగా వ్యవహరించండి. కొందరు విఘ్నాలను కలిగించాలని చూస్తారు. ఆప్రమత్తతతో వ్యవహరించండి. స్థిరాస్తుల కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ఒత్తిడికి గురికావద్దు. అనవసర వ్యయాలు వద్దు. పరమేశ్వరుడిని ధ్యానించండి.
సింహ రాశి
సింహ రాశి వారు ధైర్యంగా అడుగేయండి. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. నిర్ణయాల్లో స్పష్టత అవసరం. సమస్యలను సామరస్యంగా పరిష్కరించండి. ఆర్ధిక విజయాలు సాధిస్తారు. పొదుపు-మదుపు అవసరం. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. నవగ్రహాల్ని స్తోత్రించండి.
కన్య రాశి
కన్య రాశి వారు మనోబలంతో పనులు ప్రారంభించండి. ముఖ్య వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. దైవానుగ్రహంతో లక్ష్యాలు పూర్తవుతాయి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. వృత్తి ఉద్యోగాల్లోని ఒత్తిడిని అధిగమిస్తారు. సమస్యలు ఎదురైనా నిరుత్సాహానికి గురికాకండి. మహాగణపతిని ఉపాసించండి.
తుల రాశి
తుల రాశి వారికి అదృష్టయోగం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు పొందుతారు. ప్రతి నిర్ణయాన్నీ లోతుగా సమీక్షించుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొందరు మీ ఆలోచనల్ని దారితప్పించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని పూజించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ధనయోగం ఉంది. ప్రస్తుత పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలను కురిపిస్తాయి. మీదైన ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. ఓ ముఖ్యమైన పని పూర్తవుతుంది. వ్యాపారంలో సమయస్ఫూర్తి అవసరం. ఒంటరి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కాబట్టి నలుగురితో కలిసి ముందుకు వెళ్లండి. మహావిష్ణువును అర్చించండి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు అనువైన సమయం. ఆర్ధిక లావాదేవీలు లాభాలను కురిపిస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. లక్ష్య సాధనలో చిత్తశుద్ధి అవసరం. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆత్మీయులకు సాయం చేస్తారు. కోర్టు తీర్పులు అనుకూలం. దుర్గాదేవిని దర్శించుకోండి.
మకర రాశి
మకర రాశి వారు సకాలంలో పనులు ప్రారంభించండి. భవిష్యత్తు ఆశాజనకం. చెడు ఆలోచనలకు ఆస్కారం ఇవ్వకండి. మానసిక ప్రశాంతత అవసరం. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. సూర్యభగవానుడి అనుగ్రహంతో చేపట్టిన ప్రతి పనీ విజయవంతమే. ధనయోగం ఉంది. బుద్ధిబలానికి పరీక్షా సమయం. వేంకటేశ్వరుడిని పూజించండి..
కుంభ రాశి
కుంభ రాశి వారి ఆశయం నెరవేరుతుంది. మీ ఏకాగ్రతకు భంగం కలిగించే ప్రయత్నాలు జరుగుతాయి. సమయోచిత నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. ధన స్థానంలో బుధుడు, శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారంలో శుభప్రదమైన ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఓ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
మీన రాశి
మీన రాశి అదృష్టయోగం ఉంది. ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ధన, ధాన్యాభివృద్ధి కలుగుతుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. లక్ష్య సాధనలో దృఢ సంకల్పం తప్పనిసరి. పట్టువిడుపులు చాలా అవసరం. బుద్ధి చతురతతో వ్యాపార విజయాలు సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.