రాశి ఫలాలు (06-04-2025, ఆదివారం)
మేష రాశి
మేష రాశి వారు చంద్రుడు ప్రభావం వల్ల తల్లిదండ్రుల సౌకర్యం కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. కుటుంబంలో కార్యక్రమం కొరకు తండ్రి ఆర్థిక సహకారంతో ముందుకు వెళ్లారు. ఆధ్యాత్మిక విషయాలలో మిత్రులు కొలీగ్స్ తో కలసి దగ్గర ప్రయాణాలు, పెద్దలు గురువులను కలుస్తారు. వారి ఆశీస్సులు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో బాధ్యతలు అధికంగా ఉంటాయి. శ్రమకి తగిన గౌరవం, ఆర్థిక లాభాలు అన్నప్పటికీ వ్యక్తులతో విభేదాలు అభి ప్రాయ బేధాలు రాకుండా ముందుకు సాగాలి. వృత్తిపరమైన అంశాలలో ఆలస్యాలు ఆటంకాలు వాహన సంబంధమైన విషయాలు ఇబ్బందులు కలిగించినప్పటికీ కుటుంబ వాతావరణం సామాన్యంగా ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు కమ్యూనికేషన్, ప్రయాణాలు విషయంలో ఇబ్బందులు, ముఖ్యమైన ఆత్మీయులైన వ్యక్తులు అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆకస్మిక లాభాలకు సమానంగా అనవసరమైన ఖర్చులు చికాకును కలిగిస్తాయి. విద్యాపరమైన విషయాలలో దూర ప్రయాణాలు, విదేశీ విద్య మిత్రుల ప్రోత్సాహంతో ముందుకు ప్రయత్నాలు చేస్తారు. శ్రమకు తగిన గుర్తింపు గౌరవం. సామాజిక సేవ చేస్తారు. వృత్తి సంబంధమైన విషయాలు కొంత ఒత్తిడితో కూడిన గౌరవాన్ని, అధిక భాధ్యతల్ని తెస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో ఉద్వేగాలకు లోను కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరము. నూతన విషయాలు తెలుసుకుంటారు.
మిధున రాశి
మిధున రాశి వారికి ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, నూతన మిత్రత్వాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. ఇంతకుముందు ఇబ్బంది పెట్టిన వ్యక్తులు మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. బకాయి పడిన పాత రుణములు అందుకుంటారు. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం పనికిరాదు, ఆర్థిక విషయాలు, ప్రయాణాలు, పరిచయాలు విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తారు. మాటల వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి విషయంలో ఎక్కువ ఒత్తిడి లోనవుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ అగిన పనులు పూర్తి చేయడానికి సంకల్పం తీసుకుంటారు. వృత్తిలో వ్యక్తుల స్వార్థపూరితమైన మనస్తత్వం మీకు చికాకును. కలిగిస్తుంది. వృత్తి సంతానము సంబంధించిన అంశాలు ఒత్తిడిని, నిద్రలేమిని కలిగిస్తూ సహనాన్ని కోల్పోయేలా చేస్తాయి. వృత్తిపరంగా నూతన వ్యక్తులను కలుస్తారు గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక వృత్తికి నూతన అవకాశాలు. వృత్తికి సంబంధించి, సంతాన అభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలను భాగస్వామితో కలిసి తీసుకుంటారు. శారీరక, మానసిక ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి.
సింహ రాశి
సింహ రాశి వారికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అధిక ఆలోచనలు చికాకును కలిగిస్తాయి. నూతన దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, భూ సంబంధ అంశాల కొరకు తల్లితండ్రులను సంప్రదిస్తూ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య శ్రద్ధ అవసరము రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయాని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన సమయంలో వైద్యులను సంప్రదించటం మేలు. భాగస్వామ్య వ్యవహారాల్లో రుణముల విషయంలో ఆకస్మిక ఖర్చులు, నూతన మిత్రులు, సమావేశాలు జీవిత భాగస్వామితో కలిసి రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఒత్తిడి అలసట అపార్థాలకు అవకాశం రాకుండా చూసుకోవాలి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి నూతన గృహ వాహన విషయాలు, తల్లి ఆరోగ్యం, స్థిరాస్తులు, విద్యార్థులకు విద్యాసంబంధ విషయాలు, అనుకూలంగా ఉంటాయి. సంతాన అభివృద్ధి విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసు కుంటారు. వారి ఆరోగ్య విషయంలో, వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలలో కొత్త ఆలోచనలు చేస్తారు. అలస్యంగానైనా మీ ఆలోచనలు ఫలిస్తాయి. అన్నదమ్ములతో, ముఖ్యంగా ఆత్మీయులు, మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రుణాలు చెల్లిస్తారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు నైపుణ్యాలు పెంచుకుంటారు. నూతనవృత్తులకు అవకాశాలు అయినప్పటికీ భాగస్వామితో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు.
తులా రాశి
తులా రాశి వారు కొలీగ్స్, క్రింద పనిచేసే వ్యక్తులు కొంత వరకు సహకరిస్తారు. నిర్ణయి సామర్థ్యం బాగుంటుంది. వృత్తిపరమైన బాధ్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారంతో క్రొత్త ఆలోచనలు శ్రీకారం చుడతారు. తోబుట్టువులని సంప్రదిస్తారు. మాటలతో అపార్థాలు రాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి. గృహ వాహన స్థిరాస్తి సంబంధ అంశాలు చర్చకి వస్తాయి. తల్లి ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థుల శ్రమ అనుకూలంగా ఉంటుంది విషయాలు నేర్చుకుంటారు. సమయానికి ఆహార స్వీకరణ చేస్తారు మానసిక ప్రశాంతత సామాన్యంగా ఉంటుంది. ఆలోచనలు సృజనాత్మకంగా లాభసాటిగా ఉంటాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుటుంబ వాతావరణం కాస్త చికాకుగా ఉంటుంది. మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. శ్రద్ద తీసుకోవాలి అనుకోని శత్రుత్వాలు చికాకును కలిగిస్తాయి. జీవిత భాగస్వామి సంతానంతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణాల కొరకు ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తారు. అనవసర ఆటంకాలతో పెట్టుకున్న పనులు, ప్రయాణాలు ముందుకు సాగవు. సామర్థ్యాలు పెరిగినా శక్తి మించి కృషి చేసిన ఇరుగుపొరుగు, తోబుట్టువులతో కొంత ఘర్షణాత్మకమైన అవకాశాలు అపార్ధాలు అధికంగా ఉంటాయి. డ్రైవింగ్ చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన విషయంలో గృహం విషయంలో చికాకులు అధిక మొత్తంలో ఉంటాయి. వాటికి సంబంధించి అధిక అనవసరమైన ఖర్చులు తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తాయి. ప్రశాంతత లోపిస్తుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారు ఆరోగ్యం విషయంలో, వ్యక్తిగత అంశాలలో తగిన శ్రద్ధ అవసరం, అనవసర ఖర్చులు నియంత్రించుకోగలగాలి. సంతాన సంబంధం అభివృద్ధి కొరకు, భాగస్వామ్య వ్యవహారాలకు ఉద్వేగాలు లేకుండా నిదానంగా వ్యవహరించి పనులు సాధించుకోవాలి. రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీ నైపుణ్యాలతో అధిగమిస్తారు. జాగ్రత్తగా మాట్లాడుతూ, గౌరవం తగ్గకుండా, ఖర్చులు చేస్తూ, కుటుంబ సభ్యులతో వివాదములు రాకుండా ముందుకు వెళ్లాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకదానికి అనుకున్న ఖర్చు మరొక దానికి అవ్వడం వల్ల కొంత చికాకులు ఉంటాయి. సామర్థ్యం పెరుగుతుంది. శ్రమతో పనులు సాధించుకుంటారు. మీ క్రింద పని చేసేవారు సమయానికి సహకరించపోవడం వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ దాని అధిగమించగలరు.
మకర రాశి
మకర రాశి వారునూతన పరిచయాలు స్నేహ సంబంధాలు మొదలైన వాటి కోసం ఖర్చులు చేస్తారు. యువత భాగస్వామితో కలిపి కొత్త ఆలోచనలు చేస్తారు. దీర్ఘకాలికి పెట్టుబడుల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొంత నిద్రలేమి చికాకును కలిగిస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పౌరుషంగా తీసుకుంటారు. లాభదాయకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతారు. విదేశాలలో ఉన్న సంతానము అభివృద్ధికరంగా ఉంటుంది. ఇష్టపడిన వ్యక్తులతో వాతావరణం సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఆర్ధికవరంగా అనుకూలంగా ఉంటుంది, అత్తవారి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఆగిన పసులు, ఆధ్యాత్మిక విషయాలు సంబంధించిన అంశాలు ముందుకు సాగుతాయి. స్థిరాస్తుల కొరకు చర్చలు గృహ వాహనాలు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ బాగుంటుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఒత్తిడితో భారం అధికంగా ఉంటుంది. నూతన వృత్తులు కొరకు ప్రయత్నం చేసే వారికి దూర ప్రదేశాల్లో అవకాశాలు, ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణములు చెల్లిస్తారు. నైపుణ్యాలు పెంచుకుంటారు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అసంతృప్తిని జయించే విధంగా ఆలోచనలు చేయాలి.
మీన రాశి
మీన రాశి వారు వృత్తిపరమైన అంశాలలో బాధ్యతలు శ్రమ అధికంగా ఉంటాయి. మీ ఆలోచనలు, నైపుణ్యాలు గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం కొంత ఉండడం వల్ల ప్రశాంతత కూడా తక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ విషయములలో జాగ్రత్తలు అవసరం. మీ ఆలోచనలు ఫలిస్తాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. ఆత్మీయులైన వ్యక్తులతో అభిప్రాయ బేధాలు లేకుండా ముందుకు పెడతారు. ఆర్ధిక సంబంధమైన, భూ సంబంధ విషయాలు అనుకూలం, తండ్రి సహకారం బాగుంటుంది. సంతాన సంబంధ అంశాలలో అభివృద్ధి విషయాలలో పెట్టుబడులు, ఉపాసన బలం పెంచుకుంటారు ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు.