మేష రాశి :
మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుచి ఊహించని సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. తండ్రి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. పరిచయస్తులతో పెళ్ళి సంబంధం కుదిరే అవకాశముంది. మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
వృషభరాశి :
వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగుల ప్రతిభకు, సమర్థతకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబముతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. వృషభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
మిథునరాశి :
మిథున రాశివారికి ఈరోజు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. కుటుంబపరంగా అనుకూల సమయం. ఆరోగ్యం అనుకూలించును. ఉద్యోగ ప్రయత్నంలో అనుకోకుండా ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారపరంగా అనుకూలం. మిథున రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
కర్కాటకరాశి :
కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. శక్తికి మించి ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుండి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలం. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
సింహరాశి :
సింహరాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. రావలసిన డబ్బు వసూలవుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. సింహ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
కన్యారాశి :
కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో గుర్తింపుతో పాటు డిమాండు పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కొందరు మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశముంది. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అధికారుల నుంచి కూడా కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలను, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. కన్యా రాశివారు మరిన్ని శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
తులారాశి :
తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారాలుంటాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకం. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. కుటుంబపరంగా అనుకూల సమయం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
వృశ్చికరాశి :
వృశ్చికరాశివారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలుంటాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబముతో ఆనందముగా గడుపుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది. ధనపరంగా ఇది కలసివచ్చే కాలం. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
ధనుస్సు రాశి :
ధనుస్సు రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. పెళ్ళి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగపరంగా అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో సమస్యలు, ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ధనుస్సు రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగం ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాదాయకం. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యపరంగా అనుకూల సమయం. పిల్లల చదువుల విషయంలో సానుకూల సమాచారం అందుతుంది. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.
కుంభరాశి :
కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ అదే స్థాయిలో ఫలితం ఉంటుంది. ముమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు పరవాలేదనిపిస్తాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కొందరు మిత్రులకు సహాయం చేస్తారు. కుంభరాశి వారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకాన్ని పఠించండి.
మీనరాశి :
మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. పిల్లలు చదువుల్లో ఉన్నత ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగులకు పదోన్నతి, వేతన పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. ఖర్చులు తగ్గించుకుని పొదుపు పాటించడం మంచిది. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి లక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించండి. అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి.