Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (07-12-2024, శనివారం)

రాశి ఫలాలు (07-12-2024, శనివారం)

మేష రాశి :
మేషరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. వాహనాలు, ఇళ్ళు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సమస్యల నుంచి బయటపడతారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త పదవులు దక్కుతాయి. విదేశీ పర్యటనలుంటాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

వృషభరాశి :
వృషభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. బంధువుల నుంచి అందే ఆహ్వానాలు ఆనందాన్నిస్తాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు సునాయాసంగా పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు సఫలీకృతమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు సన్మాన యోగముంటుంది. అనుకోని ప్రయాణాలుంటాయి. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మిథునరాశి :
మిథునరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగాలలో గుర్తింపు పొందుతారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. విలువైన వస్తువులను సేకరిస్తారు. సన్నిహితుల సాయంతో విజయాలు సాధిస్తారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

కర్కాటకరాశి :
కర్కాటక రాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. బంధువులతో విభేదాలు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై దృష్టి సారిస్తారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. దూరప్రయాణాలుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

సింహరాశి :
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన సొమ్ము అందుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆరోగ్యం అనుకూలించును. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలుంటాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నం సఫలం. మిత్రులు, బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సింహరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

కన్యారాశి :
కన్యారాశివారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ధనలాభం. ఆస్తి వివాదాలు తీరి లాభం చేకూరుతుంది. వాహనయోగం ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. కొందరికి ప్రమోషన్లు లభిస్తాయి. దూర ప్రయాణాలుంటాయి. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

తులారాశి :
తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. సోదరులు, మిత్రులతో లేనిపోని వివాదాలు. అనుకోని ప్రయాణాలుంటాయి. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు ఆకస్మిక శుభవార్తలు. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవుతాయి. ధన, వస్తులాభాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. కొత్త పరిచయాలేర్పడతాయి. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

వృశ్చికరాశి :
వృశ్చికరాశివారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. సోదరులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. వాహన, కుటుంబ సౌఖ్యం. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనుస్సు రాశి :
ధనుస్సు రాశివారికి ఈరోజు అనుకూలంగా ఉంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతబాకీలు సైతం వసూలై అవసరాలు తీరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. ప్రయాణాలలో ఆటంకాలుంటాయి. ధనుస్సు రాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధువులు, మిత్రుల సలహాలు పొందుతారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలం. ఉద్యోగస్తులకు కొత్త హెూదాలుంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ధనవ్యయముండును. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభరాశి :
కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. భూవివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక చింతన. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారులకు అనుకున్న లాభాలుంటాయి. ఉద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయి. రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలుంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి వేంకటేశ్వరస్వామిని పూజించండి. సుప్రభాతాన్ని పఠించండి.

మీనరాశి :
మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుంచి ధనలాభముంటుంది. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. అనారోగ్య సూచనలు. అనుకోని ప్రయాణాలు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శనికి తైలాభిషేకం చేయండి. దశరథ ప్రోక్త శని సోత్రాన్నిపఠించండి.

Recent

- Advertisment -spot_img