Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (13-03-2025, గురువారం)

రాశి ఫలాలు (13-03-2025, గురువారం)

రాశి ఫలాలు (13-03-2025, గురువారం)

మేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు సన్నిహితులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. పక్షులకి నీళ్లని పెట్టండి. విదేశాలలో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు.

వృషభ రాశి
వృషభ రాశి వారు ఈ రోజు కొత్త కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. లక్ష్మీ తామర వత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. సన్నిహితుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. బంధువులు, మిత్రులను కలిసి అనందంగా గడుపుతారు.

మిథున రాశి
మిథున రాశి వారు ఈ రోజుచేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా తొలగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకోని అవకాశాలు లాభిస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ రోజుదీర్ఘకాలిక ఆశయాలను నెరవేర్చుకోవడానికి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సంభాషణలు సాగిస్తారు. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శివాలయాల్లో శెనగలు ఇవ్వండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నర దిష్టి తొలిగిపోతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు మరింత బలపరచుకొనే యత్నాలు చేస్తారు.

సింహ రాశి
సింహ రాశి వారు ఈ రోజు దేవాలయ సందర్శనం చేసుకుంటారు. కార్యాలయంలో అధికారులు మెప్పు పొందుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు సాధిస్తారు. భవిష్యత్తు బంగారు బాటగా కనబడుతుంది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. పొదుపు పథకాలు ముందదుగులో ఉంటాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి.

కన్య రాశి
కన్య రాశి వారికి ఈ రోజు ఓర్పు, సహనం అధికంగా కలిగి ఉంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కుక్కలకి చపాతీలు తినిపించండి. నిపుణుల సలహాలు పాటించి లాభపడతారు. సంవృద్ధికరమైన ఆర్థిక వనరులు సంతోషానికి కారణం అవుతాయి. సన్నిహితుల నుంచి. శుభవార్తలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత పొందుతారు.

తుల రాశి
తుల రాశి వారు ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సంఘ సేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు బహుమతులుగా ఇస్తారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఈ రోజు పలువురి మెప్పుని పొందుతారు. దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు నుండే నెమ్మదిగా ఆ దిశ వైపు అడుగు వేయాలన్న ఆలోచనలు కలసి వస్తాయి. స్నేహితుల రసహాయము అందుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు. లక్ష్మీ తామరవత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు, ప్రయోజనాలని అందుకుంటారు.

ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ రోజు బాగుంటుంది. కార్యాలయంలో మీ ప్రతిపాదసులను ఏకగ్రీవంగా ఆమోదిస్తారు. పుస్తక పఠనం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. పక్షులకి దాన వేయండి.. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్ధం పొడితో అభిషేకం చేయడండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. దూర ప్రాంతాలలోని మీ వారితో సంభాషణలు సాగిస్తారు. బ్యాంకు లావాదేవీలు పరిశీలించుకుంటారు. సంతృప్తి పడతారు. హోదా పెరుగుతుంది.

మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సంతాన పురోభివృద్ధి బాగుంటుంది. మంచి సమాచారం అందుకుంటారు. శ్రమకు అదృష్టం తోడవుతుంది. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. సంతాన పురోగతి బాగుంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక ప్రసంగాల పట్ల ఆకర్షితులు అవుతారు, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు.

కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు వినోద కార్యక్రమాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఏ పనిని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. షేర్లు భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. మిత్ర బృందంతో చర్చలు సాగిస్తారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. స్వల్పమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. కొంతమంది వల్ల నిరాశ ఎదురవుతుంది. ఆశించిన స్థాయిలో వారి అండదండలు లభించకపోవచ్చు.

మీన రాశి
మీన రాశి వారికి ఈ రోజు ఆర్ధిక విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో మీకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. గతంలో మీకు సానుకూల పడని వ్యవహారాలు నేడు సానుకూల పడతాయి. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. ప్రభుత్వ పరమైన కొన్ని కాంట్రాక్టులు, లీజులు, లైసెన్సులు, కలిసి వస్తాయి.

Recent

- Advertisment -spot_img