Homeహైదరాబాద్latest Newsరాశిఫలాలు (2-12-2024, సోమవారం)

రాశిఫలాలు (2-12-2024, సోమవారం)

మేష రాశి :
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పిల్లలకు శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం అనుకూలించును. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. నోటీసులు అందుకుంటారు. మేషరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శివాష్టకం స్తోత్రం పఠించండి. శివాలయాలను దర్శించండి.

వృషభరాశి :
వృషభరాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పట్టుదలతో ముందుకు సాగండి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. వాదనలకు దిగకండి. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గత సంఘటనలు ఆనందాన్నిస్తాయి. అవకాశాలు చేజారిపోతాయి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులుంటాయి. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృషభరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి లింగాష్టకం పఠించడం మంచిది.

మిథునరాశి :
మిథునరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. నోటీసులు అందుకుంటారు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి. కొందరి రాక మీకు ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపకాలు అధికమవుతాయి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. రావలసిన ధనం చేతికి అందుతుంది. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శివుడిని ఆరాధించడం మంచిది. లింగాష్టకం వంటివి పఠించండి.

కర్కాటకరాశి :
కర్కాటక రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. కష్టానికి తగిన ప్రతిఫలముంటుంది. చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ధైర్యంగా ప్రయత్నాలు సాగించండి. స్నేహ సంబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంప్రదింపులు సానుకూల ఫలితాన్నిస్తాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వాయిదాల చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి సూర్యాష్టకాన్ని పఠించండి.

సింహరాశి :
సింహరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ నొప్పించకండి. మీ వ్యాఖ్యలు వివాదాస్పదం కాకుండా చూసుకోండి. ఊహించని ఖర్చులుంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ప్రధానం. పట్టుదలతో ముందుకు సాగండి. సింహరాశివారు మరింత శుభ ఫలితాలు పొందటానికి శివాష్టకం, శివస్తోత్రం పఠించడం మంచిది.

కన్యరాశి :
కన్యరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. మీ నుంచి విషయాన్ని రాబట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తారు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఆరోగ్యం అనుకూలించును. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. రుణ విముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. కన్యారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివుడిని పూజించండి. రుద్రాష్టకం పఠించండి.

తులారాశి :
తులారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. ప్రముఖులకు చేరువవుతారు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. లావాదేవీలతో తీరిక ఉండదు. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అవకాశాలు కలసివస్తాయి. సభ్యత్వాలు, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివస్తోత్రాన్ని పఠించండి. శివాలయాన్ని దర్శించండి.

వృశ్చికరాశి :
వృశ్చికరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం కనిపిస్తుంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయం చేసేందుకు అయినవారే సందేహిస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆత్మీయులతో తరచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వృశ్చికరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివ స్తోత్రం పఠించండి. శివారాధన చేయండి.

ధనుస్సురాశి :
ధనుస్సురాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. రావలసిన ధనాన్ని లౌక్యంగా రాబట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆత్మీయుల విమర్శలు కార్యోన్ముఖులను చేస్తాయి. పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తారు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. ప్రయాణాలు వాయిదాపడతాయి. ధనుస్సురాశి వారు మరింత శుభ ఫలితాలు పొందటానికి లింగాష్టకం పఠించండి. శివాలయాన్ని దర్శించండి.

మకరరాశి :
మకరరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. పరిచయస్తుల విమర్శలు పట్టించుకోవద్దు. ఒక ఆహ్వానం ఆనందాన్నిస్తుంది. ప్రణాళికబద్ధంగా మీ పనులు పూర్తి చేస్తారు. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సాయం ఆశించి భంగపడతారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ధైర్యంగా ప్రయత్నాలు సాగించండి. మకరరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివుడిని ఆరాధించండి. అలాగే శివాష్టకం, లింగాష్టకం వంటివి పఠించండి.

కుంభరాశి :
కుంభరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. ధనలాభం, వాహనయోగమున్నది. బంధువులు ధన సహాయం ఆర్థిస్తారు. కొంత మొత్తం సాయం అందించండి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. మీ సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. మధ్యలో ఆగిపోయిన పనులు మొత్తానికి పూర్తవుతాయి. కుంభరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివస్తోత్రాన్ని పఠించండి. శివుని దర్శించండి.

మీనరాశి :
మీనరాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు అధికమవుతాయి. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. పెట్టుబడులుకు అనుకూల సమయం. మీ కృషి ఫలిస్తుంది. నిదానంగా మీ పనులు పూర్తి చేస్తారు. మీనరాశివారు మరింత శుభఫలితాలు పొందటానికి శివుడిని ఆరాధించండి. లింగాష్టకం, శివాష్టకం వంటివి పఠించండి.

Recent

- Advertisment -spot_img