రాశి ఫలాలు (22-03-2025, శనివారం)
మేషం రాశి:
మేష రాశి వారికి గ్రహసంచారాలు అనుకూలం. కుటుంబ వ్యక్తులచే సహాయ సహకారాలు పొందుతారు. ముఖ్యమైన పనులను అనుకొన్నట్లుగా పూర్తి చేస్తారు. నూతన పనులను చేపట్టుకొనేందుకు అనుకూల సమయం. వృత్తి ఉద్యోగ మార్పులకు అనుకూలమైన, సరైన ఆలోచనలతో వ్యవహరించుకోవాలి. ఆరోగ్య విషయంలో నుంచి మార్పులు చూడగలరు. విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్తలు ఉంటాయి. ప్రయాణాలు సౌఖ్యదాయకంగాను, సౌకర్యవంతంగాను సాగగలవు.
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఆదాయం వృద్ధి చెందే అవకాశాలున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన స్థితులుంటాయి. ఇతరులపై ఆధార పడకండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యమునకు జాగ్రత్తలు పాటించుకోవాలి. అధికారుల నుండి ప్రోత్సాహాలు పొందగలరు. వివాహాది నిశ్చయాలు కొందరికి ఏర్పడతాయి.
మిథున రాశి:
మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అదనపు పని భారాలు ఉంటాయి. కర్తవ్యాల్ని పట్టుదలలతో చేపట్టుకొని పూర్తి చేసుకోవాలి. ఆదాయాలు పరవాలేనివిగా ఉన్నా ఖర్చులు పెరగగలవు. షేర్లు, పెట్టుబడులకు దూరంగా ఉండుట మంచిది. యంత్ర వాహనాలతో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారి గ్రహ సంచారములు మిశ్రమముగా ఉన్నవి. శ్రమ, పట్టుదల చూపించాల్సి ఉంటుంది. పెండింగ్ పనులపై దృష్టి సారించగలుగుతారు. వృత్తి, వ్యాపారాల్లో చెల్లింపులు పూర్తి చేసుకొనునట్లు ఆదాయాలుంటాయి. ఉద్యోగాల్లో మీ పై ఒత్తిడి పెరగచ్చు. సొంత వాహన ప్రయాణాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. విద్యార్థులు టార్గెట్ విధానాలను పాటించుకోవాలి.
సింహ రాశి:
సింహ రాశి వారు ప్రయాణాలను ఎక్కువ చేస్తారు. వ్యక్తిగతమైన అవసరాల్లో సర్దుకుపోవలసి వుంటుంది. నూతన ఆదాయ మార్గాన్ని అన్వేషించి అమలు పెట్టగలుగుతారు. ఊహించుకున్న పనుల్లో మంచి మార్పులు చూస్తారు. బంధు, మిత్ర వర్గం నుండి చిన్న తరహా విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చును.
కన్య రాశి:
కన్య రాశి వారి కుటుంబంలో అనురాగ వాత్సల్యములు వృద్ధి చెందుతాయి. ఆలోచనలను అమలులో పెట్టగలుగుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు ఉంటాయి. కొన్ని ప్రయాణాలను, కొందరితో సంబంధాలను దూరం చేసుకొనే ఆలోచనలు చేయగలరు. ఉద్యోగులకు గుర్తింపులు ఏర్పడగలవు. ఆదాయాల్లో వృద్ధి ఉండగలదు.
తుల రాశి:
తుల రాశి గ్రహస్థితి మిశ్రమముగా ఉపకరిస్తుంది. చేపట్టుకొన్ని పనులకు పట్టుదలలు జోడించాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాధ్యతాయుత ప్రవర్తనకు గుర్తింపులు పొందుతారు. ఆదాయాల్లో హెచ్చు తగ్గులుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలరు. శుభకార్య ప్రయత్నాలు ఉంటాయి. నూతన యంత్ర, వాహనాలు అమరికలు చేసుకోగలరు. గతంలో రావలసినవి క్రమముగా వసూలవ్వగలవు. బంధుమిత్రులతో ఇచ్చిపుచ్చుకోవడాలు అనుకూలిస్తాయి.
వృశ్చిక రాశి:
వృశ్చిక రాశి వారికి గ్రహ సంచారాలు మిశ్రమముగా ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ముందుచూపు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యక్తులు కలిసి వ్యవహరించుకోండి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో జాగ్రత్త వహించుకోండి. అధికారులు, పెద్దలు వంటి వారు సహకరించగలరు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి గ్రహసంచారాలు అనుకూలం. అన్నిటా ఉత్సాహముగా వ్యవహరించుకొని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోగలరు. కుటుంబ వ్యక్తుల ఆరోగ్యమునకై చిన్న తరహా వైద్య సహాయాలు అవసరమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడులు దూరం చేసుకోవడమే కాక గుర్తింపులు పొందుతారు.
మకర రాశి:
మకర రాశి వారి గ్రహ సంచారాలు మిశ్రమ ఫలితమిస్తాయి. ప్రయత్నాల్ని ఊహించుకొన్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. స్వార్థపూరిత ఆలోచనలను కొనసాగించుకొంటారు. ఆధ్యాత్మికతతో కూడిన ప్రయాణాల్ని చేపట్టుకోగలరు. ఒకదానికై ఉంచిన ధనమును వేరేందుకు వినియోగించవలసి రావచ్చు. భ్రాతృవర్గంతో వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది. వాహన, యంత్రాదుల విషయాల్లో మార్పు చేస్తారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారి గ్రహసంచారాలు అనుకూలత సామాన్యముగా ఉన్నవి. ఆర్థిక అవసరముల పట్ల ముందు జాగ్రత్తలు అవసరం. ఇంటా బయటా చిన్నతరహా చికాకులను ఎదుర్కోవలసి వుంటుంది. కుటుంబ పెద్దలచే సహకారాలు ఏర్పరచుకోగలరు. సంతాన విద్యావ్యవహారాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో స్థిరమైన ఆలోచనలు కొనసాగేటట్లు జాగ్రత్తలు పాటించండి.
మీన రాశి:
మీన రాశి వారి గ్రహసంచారాలు మిశ్రమముగా ఉన్నాయి. అధికారులతోను, పెద్దవారితోను సంయమనాలతో సాగాలి. ఆరోగ్య విషయంలో చిన్నతరహా జాగ్రత్తలు అవసరం. ఖర్చులు, ఆదాయాలు ఊహించినట్టు ఉంటాయి. కుటుంబంలో వాడి వేడి చర్చలు జరగగలవు. వ్యాపారాల్లో నూతనమైన అగ్రిమెంట్లు చేసుకోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాల్లో సొంత ఆలోచనలకే ప్రాధాన్యత ఇవ్వండి.