మేష రాశి:
అన్నింటా ఉత్సాహంగా వ్యవహరించుకోగల్గుతారు. అధికారులతో సంయమనాలు చూపుకోండి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. ఉద్యోగులు ఆశించకుండా బాధ్యతలు నిర్వహించుకోవాలి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా-బయటా గత సమస్యలను సమర్థించుకొంటారు. ప్రయాణాలు, పెట్టుబడులు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభవార్తలుంటాయి.
వృషభ రాశి:
చేపట్టుకొన్న పనులను చకచకా పూర్తిచేసుకోగల్గుతారు. పలుకుబడిని ఉపయోగించుకొని ముఖ్యమైన పనుల్ని పూర్తిచేసుకుంటారు. భ్రాతృవర్గం నుండి విమర్శలు ఎదుర్కోవలసిరావచ్చును. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధిని పొందుతారు. స్థిరాస్తులు చేతికొస్తాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఊహించుకొన్న అవకాశాలేర్పడతాయి. ఊహించని ప్రయాణాలేర్పడతాయి.
మిథున రాశి:
కుటుంబ వ్యవహారాల్లో సంయమనముతో సాగాలి. అవసరాలను సమర్థించుకొనునట్లు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సాధారణతలు కొనసాగుతాయి. కొన్ని విషయాల్లో అధికారులతో ఉద్యోగులు రాజీపడి వ్యవహరించుకోవలసి రావచ్చును. వ్యాపారాలలో రావలసిన అనుమతులకై ఎదురుచూడవలసి వుంటుంది.
కర్కాటక రాశి:
కొన్నిట టెన్షన్లు, కొన్నిట ఉత్సాహాలు ఉంటాయి. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయాలు పెరగకుండా జాగ్రత్తలు అవసరం. కుటుంబ వ్యక్తులకై ఎక్కువ సమయం గడపవలసిరావచ్చును. వసూలు అవుతాయని ఊహించుకొన్న బెనిఫిట్స్ వంటివి నిరాశలకు గురిచేస్తాయి. సంతానం నుండి శుభవార్తలు వినుట, వారికై చిన్నతరహా బహుమతులు ఏర్పరచుటవంటివి ఉంటాయి.
సింహ రాశి:
చిన్నతరహా ఆనందాలకు కాలం వచ్చినా తెలియకుండా వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడిని ఏర్పరచుకొనే సూచనలున్నాయి. కుటుంబ విషయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యక్తిగత విషయాలలో ఇతరుల ప్రమేయాలచే భావోద్వేగాలకు గురికాగల సూచనలున్నాయి. ఆరోగ్య, ఆర్థిక విషయాలు పరవాలేదనే విధంగా సాగుతాయి. మీ ప్రతి నిర్ణయానికి పునఃపరిశీలనలు తప్పనిసరిగా చేయండి.
కన్య రాశి:
అభివృద్ధికై అదనపు రుణాలను స్వీకరిస్తారు. ఖర్చులు సామాన్యం. బంధుమిత్ర వర్గానికి సహకరిస్తారు. నిర్దిష్టమైన ప్రయత్నాల్ని సాగిస్తారు. వ్యాపారాలు ఊహించుకొన్నట్లుగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూస్తారు. అనవసర విషయాలకు స్పందించకుండా బాధ్యతా యుతంగా సాగితే గుర్తింపులు పొందుతారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు శుభవార్తలుంటాయి.
తుల రాశి:
కొన్నిట టెన్షన్లు, కొన్నిట ఉత్సాహాలు చూస్తారు. సామాజిక పరి స్థితులలో చిన్నతరహా ఒత్తిడులను చూస్తారు. తలపెట్టుకొన్న సంప్రదింపులు పూర్తిచేసుకుంటారు. వ్యాపారాల్లో ఒత్తిడులను సమర్థించు కొంటారు. ఉద్యోగులకు బాధ్యతల మార్పు, సీటు మార్పులు ఉంటాయి. స్థిరాస్తుల్ని క్రమబద్దీకరించుకొంటారు. రాబడి- పోకడలపై దృష్టిపెట్టగలుగు తారు.
వృశ్చిక రాశి:
గ్రహసంచారాలు మూడువంతులు అనుకూలం. ప్రయత్నాలకు పట్టు దలలు చూపి సాధించుకొంటారు. ఆర్థికంగా వృద్ధినిచ్చు అంశాలను చేపట్టుకుంటారు. ఒప్పందాలు, ఎగ్రిమెంట్లు పూర్తిచేసుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు తొందరపాటుతో కూడిన నిర్ణ యాలు ఉండకుండా జాగ్రత్తపడాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సాధారణ తలు కొనసాగుతాయి.
ధనుస్సు రాశి:
నిర్దిష్టమైన ప్రణాళికలతో సాగాల్సివుంటుంది. గత పరిచయా లచే చిన్నతరహా ఇరకాట పరిస్థితులను చూడవలసిరావచ్చును. కుటుంబ వ్యక్తులనుండి సహకారాలు ఏర్పరచుకుంటారు. చేపట్టుకున్న పను లను మధ్యలో ఆపకుండా సాగాలి. ఆదాయానికి తగిన ఖర్చులనే చేపట్టు కోండి. యంత్ర వాహనాలతో జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. వాయిదాల చెల్లింపులకు జాగ్రత్తలు తీసుకోండి.
మకర రాశి:
ఇతరులను నొప్పించకుండా వ్యవహరించుకోవలసివుం టుంది. కుటుంబంలో ఊహించని నిశ్శబ్దతలు చోటుచేసుకొంటాయి. ఖర్చులలో మెలకువలు తప్పనిసరి చేయండి. ప్రతికూలతలు, ఆటంకాలు ఉంటున్నా చేపట్టుకొన్న పనులకు పట్టుదలలు చూపుకొంటే అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాలలో సాధారణతలు కొనసాగుతాయి.
కుంభ రాశి:
ఈ వారంలో పనులకు పట్టుదలలు జోడించండి. మీవికాని విష యాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతంగా సాగాలి. అవసరా లను సమర్థించుకొనునట్లు ఆదాయాలుంటాయి. బంధువర్గంతో సరదాలు పంచుకొంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం చికాకుపరచగలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రొటేషన్లకే ప్రాధాన్యతనిచ్చుకొని సాగాలి. విద్యార్థులు టార్గెట్ విధానాల్ని పాటించుకోవాలి.
మీన రాశి:
ఈ వారంలో గ్రహసంచారాలు సామాన్య ఫలితమిస్తాయి. కుటుంబంలో సహ కార లోపత్వములు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనికి తగినంత సమయ కేటాయింపులు అవసరం. ఖర్చులను, ఆదాయమును సరిచూసు కుంటూ సాగాలి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటూ వ్యవహరించుకోవాలి. విద్యార్థులు, అధ్యాపకులతో సంయమనములు పాటించుకోవాలి.