Homeహైదరాబాద్latest Newsరాశి ఫలాలు (27-02-2025, గురువారం)

రాశి ఫలాలు (27-02-2025, గురువారం)

రాశి ఫలాలు :

మేష రాశి
అదృష్టయోగం ఉంది. ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సమర్థంగా వ్యవహరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. మీ వల్ల నలుగురికీ మంచి జరుగుతుంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ముఖ్య నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీమన్నారాయణుడిని ధ్యానించండి.

వృషభ రాశి
ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు. పెద్దల మన్ననలు పొందుతారు. అధికార లాభం సూచితం. గతంలోని చికాకులు తొలగిపోతాయి. ఆర్ధికంగా ప్రయోజనం పొందుతారు. అదృష్టయోగం ఉంది. వ్యాపార లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి. లక్ష్మీదేవిని పూజించండి.

మిధున రాశి
ముఖ్య విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆత్మవిశ్వాసానికి భంగం కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి. ఎరుకతో వ్యవహరించండి. కొన్నిసార్లు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు. వ్యాపార వ్యవహారాల్లో దృఢ సంకల్పం అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించండి.

కర్కాటక రాశి
విజయాలు వరిస్తాయి. ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంయమనం అవసరం. మొహమాటం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకుంటారు. వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. కనకధారా స్తోత్రం పఠించండి.

సింహ రాశి
ముఖ్య నిర్ణయాల్లో దూకుడు అవసరం. అష్టమ శుక్రయోగం సిరిసంపదల్ని ప్రసాదిస్తుంది. పొదుపు-మదుపు చర్యలకు సరైన సమయం. అనుకోని ఖర్చులూ ఎదురుకావచ్చు. భూలాభం సూచితం. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సకాలంలో లక్ష్యాలను అధిగమించి అభినందనలు అందుకుంటారు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

కన్య రాశి
శుభకాలం నడుస్తోంది. ఆశించిన ఫలితాలు అందుతాయి. దైవబలం ముందుకు నడిపిస్తుంది. నేటి నిర్ణయాలే భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ఆలోచనలు కార్యరూపం ధరిస్తాయి. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. ఆర్ధిక జాగ్రత్తలు అవసరం. రుణభారం పెంచుకోవద్దు. నలుగురితో సున్నితంగా సంభాషించండి. మహాలక్ష్మిని ధ్యానించండి.

తుల రాశి
దైర్యంగా అడుగు వేయండి. మీరు నమ్మిన దర్శమే మిమ్మల్ని కాపాడుతుంది. విఘ్నాలను అధిగమిస్తారు. ఒంటరి ప్రయత్నాలు వద్దు. ఆత్మీయుల సంప్రదింపులతో నిర్ణయాలు తీసుకోండి. గ్రహదోషం ఉంది. ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచనల్లో స్పష్టత అవసరం. ఆర్ధిక వ్యవహారాల్లో తడబాటు వద్దు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి..

వృశ్చిక రాశి
అన్ని విధాలుగా కలిసొస్తుంది. మీ నిర్ణయాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. వ్యాపార విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. బుద్ధిబలం గెలిపిస్తుంది. పంచమ శుక్రయోగం ఆర్ధిక విజయాన్ని అందిస్తుంది. కొత్త అవకాశాల్ని సద్వినియోగం చేసుకోండి. కలహాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఇష్టదైవాన్ని ప్రార్ధించండి.

ధనుస్సు రాశి
ఉద్యోగులకు మేలైన ఫలితాలు ఉన్నాయి. అధికారులతో సంబంధాలు బలపడతాయి. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. చతుర్ద శుక్రయోగం సంపదల్ని ప్రసాదిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణానికి సరైన సమయం. లక్ష్మీ అష్టోత్తరం పరించండి.

మకర రాశి
శుభ ఫలితాలు సాధిస్తారు. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులకు యజమానుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారం లాభదాయకం. కొత్త ప్రయత్నాలు సఫలం అవుతాయి. గృహయోగం ఉంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. నిర్ణయాల విషయంలో స్థిరంగా వ్యవహరించండి. జీవిత లక్ష్యానికి మరింత చేరువ అవుతారు. కనకధారా స్తోత్రం చదువుకోండి.

కుంభ రాశి
ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. శుక్రయోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే, లక్ష్య సాధనలో మరింత ఏకాగ్రత అవసరం. ఒత్తిడికి గురికావద్దు. చెడును ఊహించకండి. అపార్ధాలు ఆత్మీయుల మధ్య అగాధాలు సృష్టిస్తాయి. పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోండి. కొన్నిసార్లు మౌనమే ఉత్తమం. మహాగణపతిని ధ్యానించండి.

మీన రాశి
ఆర్థికంగా శుభకాలం. ఆభీష్టసిద్ధి కలుగుతుంది. మనోబలంతో కొత్త ప్రయత్నాలు ఆరంభించండి.. సరైన ప్రణాళికతో విజయాలు చేరువ అవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. కొందరు అవరోధాలు సృష్టించాలని చూస్తారు. సంక్లిష్ట సమయంలో మీరు నమ్మిన ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఓ శుభవార్త వింటారు. వేంకటేశ్వరుడిని ఉపాసించండి.

Recent

- Advertisment -spot_img