రాశి ఫలాలు (28-03-2025, శుక్రవారం)
మేష రాశి
మేష రాశి వారికి ఖర్చులు సామాన్యముగా ఉంటాయి. బంధుమిత్రులతో సంభాషణల్లో జాగ్ర త్తలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సంయనునాలకు ప్రాధాన్యతనిచ్చుకొంటూ సాగుట మంచిది. స్థిరాస్తుల క్రయవిక్రయాల్లో జాగ్రత్తగా చూసుకోండి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి అంతా ఉత్సాహ కరంగా సాగుతుంది. ముఖ్యమైన సమాచార సేకరణలు, నూతన వస్తు ఆభరణాల్ని పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు దూరమగుట, గుర్తింపులు పొందుట ఉంటాయి. సమీపుల ఉత్సాహాల్లో పాల్గొంటారు. విద్యార్థులు విషయ సంగ్రహం చేసుకోగలరు.
మిథున రాశి
మిథున రాశి వారు కొన్ని పనుల్ని ఉత్సాహంగా పూర్తి చేసుకుంటారు. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు ఏర్పడతాయి. చేద్దాము, చూద్దామనే భావాలను దూరం చేసుకోండి. నూతన వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వాహన, యంత్రాదుల్లో జాగ్రత్తలు తప్పని సరి చేయండి. ఆరోగ్యపరంగా చిన్నతరహా జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంటా బయటా సహకరించువారు పెరుగుతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి చేపట్టుకొన్న పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా సామాన్య స్థితులుంటాయి. ఇంటా బయట సంయమనాలు చూపుతూ సాగవలెను. ఋణదాతలకు అందుబాటులో ఉండు టచే ఒత్తిడులను దూరం చేసుకుంటారు. సంతాన విద్యా, ఉద్యోగ విషయాలు సంతృప్తిని ఇస్తాయి. భూ-లావాదేవీలు సక్రమంగా పూర్తి చేసుకుంటారు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఆర్థిక, ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటూ అన్నిటా పని ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యవహార విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవలసి రావచ్చును. చేపట్టుకొన్నవి అటూ ఇటుగానైనా పూర్తి చేసుకుంటారు. ఇంటా బయటా విమర్శల్ని ఎదుర్కోవలసి రావచ్చు. కుటుంబ వ్యవహారాలకు ప్రాధాన్యతని ఇవ్వలేరు.
కన్య రాశి
కన్య రాశి వారికి గ్రహబలాలు అనుకూలమైనా తెలియని ఒత్తిడిని చూస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యంగా హుషారుగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో గుర్తింపులు, కొందరికి అధికారిక హోదాలు ఏర్ప డుట ఉంటాయి. కీలకంగా వ్యవహరించుకొంటారు. శత్రు వర్గం నుండి స్నేహహస్తాల్ని చూడగలరు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో సంతృప్తి ఉంటుంది.
తుల రాశి
తుల రాశి వారికి గతం కంటే ఉత్సాహంగా ఉంటుంది. సహకరించు వ్యక్తులు పెరుగుతారు. సంతానమునకు బహుమతులు, ఆప్యాయతలు పంచుకొనుటవంటివి ఉంటాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు ఉంటాయి. ఖర్చులు తగ్గుతాయి, అవసరాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సానుకూల దృక్పథం చూపుకొనుటచే అన్నిటా మంచిని చూస్తారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు శని, కుజులకు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకొంటూ వ్యవహరించుకోవాలి. ప్రతికూలతలను ఎదుర్కోవలసిరావచ్చును. మౌనంగా ఓర్పుతో సాగాల్సి వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో రొటేషన్లకు ప్రాధాన్యతను ఇచ్చుకొంటూ సాగాలి. తోటి ఉద్యోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించుకోవాలి. అన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించుకోవాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. ఇంటా బయటా చిన్నతరహా చికాకులు ఏర్పడతాయి. ప్రతి పనికీ పట్టుదలలు చూపాల్సి వుంటుంది. బంధు మిత్రుల నుండి సలహాలు, సూచనలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరమైన ఆలోచనలతో సాగాల్సి వుంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి.
మకర రాశి
మకర రాశి వారికి గందరగోళ పరిస్థితులు ఉన్న క్రమంగా అనుకూలతలు చూస్తారు. ఖర్చులను నియంత్రించు కొంటూ అదనపు ఆదాయాలపై దృష్టినుంచగలరు. ఆరోగ్యానికై ఔషధసేవలు ఉండు సూచనలున్నాయి. సోదర వర్గంతోను, తోటి ఉద్యోగులతోను మాట పట్టింపులు ఉండే సూచనలున్నాయి. అన్ని విషయాలలో జాగ్రత్తలు అవసరం.
కుంభ రాశి
కుంభ రాశి వారు ఊహించని విధంగా అనుకూలతలు చూడగలరు. వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేసుకొంటారు. ప్రయత్నాలను విరమించకండి. ఆదాయ-వ్యయాలు సంతృప్తికరం. వృత్తి, వ్యాపార, విద్యలలో టార్గెట్ విధానాలు ఉపకరిస్తాయి. కుటుంబంలో సామరస్య ధోరణితో సాగండి. ప్రయాణాల్లో అనవసరమైనవి గుర్తించి విరమించాలి. అగ్రిమెంట్లు, ఒప్పందాలు పూర్తి చేసుకుంటారు. అన్నిటా జాగ్రత్తలు పాటించుకోవాలి.
మీన రాశి
మీన రాశి వారికి గ్రహసంచారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసానికి గురికాకుండా జాగ్రత్తలు పాటించుకోవాలి. స్థిరాస్తుల క్రయవిక్రయాలకు ఆలోచనలు అవసరం. అధికారిక హోదాలలో ఉన్నవారు ముందు జాగ్రత్తలు తప్పనిసరి చేసుకోవాలి. గృహంలో ప్రశాంతతలు కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. జాగ్రత్తలు అవసరం.