రాశి ఫలాలు (20-03-2025, గురువారం)
మేష రాశి
మేష రాశి వారు ప్రతి ఒక్క విషయంలోనూ నిరాశకు గురి కావడం, ఇబ్బందికరమైన మాటలు వినటం, పెద్ద సమస్యగా మారుతుంది. ఇలా మాట్లాడే వారికి దూరంగా ఉండాలి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి, అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని పొదుపు చేస్తారు.
మిథున రాశి
మిథున రాశి వారు గృహ సమస్యల నుంచి బయటపడతారు. స్నేహ ఒప్పందాలు బలపడతాయి. వృత్తి సంబంధమైన అభివృద్ధిలో ఆటంకాలు తొలగిపోతాయి. వెన్నునొప్పి బాధించే సూచనలు ఉన్నాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. వివాదాలకు, విభేదాలకు దూరంగా ఉండండి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆర్ధిక సంబంధ వ్యవహారాలలో లోటు పాట్లు తప్పక పోవచ్చు. విపరీతమైన పని ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు. అకారణముగా ఒక మిత్రుడితో విరోధం రాకుండా ముందు జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం అన్ని వేళలా అండగా ఉంటుంది. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి.
సింహ రాశి
సింహ రాశి వారు దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారానికి, ఉద్యోగానికి సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారాన్ని మీరు అందుకుంటారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. మాట తొందర పాటు మిమ్ములను ఇబ్బందులకు గురి చేసే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి.
కన్య రాశి
కన్య రాశి వారు తెలివితేటలు నైపుణ్యం ప్రదర్శించటానికి ఒక చక్కని అవకాశము మీ ముందుకు వస్తుంది. నేర్పుగా ఉపయోగించుకోండి. కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతంగా ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఆర్థికంగా లాభపడతారు. సిద్ధ గంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన జరిపించండి.
తుల రాశి
తుల రాశి వారు ఇతరులను మెప్పించి మీ పనులు సానుకూల పరచుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఒక ఆహ్వానానికి, ప్రకటనకు లేదా ఉత్తరానికి మీరు ప్రతిస్పందిస్తారు. తలపెట్టిన కార్యం జయం అవుతుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. కార్యాలయంలో నూతనోత్సాహంతో శ్రమించి మంచి ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక లోపం వలన మీరు అందవలసిన సమాచారం సకాలంలో మీకు చేరకపోవచ్చు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఇంటర్వ్యూలలో అనకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని నేర్పుగా ఉపయోగించుకోండి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. గోశాలలో గరిక దానం చేయండి. విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అజీర్తి బాధించే అవకాశం ఉంది. ఒకానొక ప్రయాణం మీకు అనుకూలంగా మారుతుంది. శుభవార్తలు వింటారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి.
మకర రాశి
మకర రాశి వారు వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని అమలు పరుస్తారు. యోగాభ్యాసం, ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్ధం పొడితో అభిషేకం చేయండి. కుటుంబంలో ఐకమత్యం, మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్ లాభాలు బాగుంటాయి.
కుంభ రాశి
కుంభ రాశి వారు సభలు, సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ముఖ్యంగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాట తీరు పట్ల జాగ్రత్తలు వహించండి. ప్రభుత్వపరమైన, చట్టపరమైన ఇబ్బందుల నుండి బయటపడతారు. గోమతి చక్రాలతో లక్ష్మీ దేవి అష్టోత్తరాన్ని చదువుతూ అమ్మవారికి పూజ చేయండి. శుభవార్త వింటారు. శుభకార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేయడానికి గ్రహగతులు అనుకూలిస్తాయి.
మీన రాశి
మీన రాశి వారికి స్వల్పంగా ధన లాభ సూచన. వ్యక్తిగత ప్రతిష్టను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలను మరింతగా ముమ్మరం చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంబంధిత పెండింగ్ బిల్స్ మంజూరవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి.