ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హరికృష్ణ ట్రావెల్స్ బస్సులో ప్రయాణికురాలిపై డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. కదులుతున్న బస్సులోనే మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ దారుణానికి ఒడికట్టాడు. మహిళ అరుపులు విన్న తోటి ప్రయాణికులు 100 నంబర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో OU పీఎస్ పరిధిలో బస్సును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.