Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్కూటీని లారీ ఢీకొట్టడంతో...

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూల్ నుంచి ఇంటికి వెళ్తుండగా స్కూటీని లారీ ఢీకొట్టడంతో విద్యార్థిని మృతి (VIDEO)

హైదరాబాద్ లోని హబ్సిగూడలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీని లారీ ఢీకొట్టడంతో కామేశ్వరి అనే 6వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. సంతోషి అనే మహిళ తన కుమార్తె కామేశ్వరి, కుమారుడు వేదాన్ష్ ను రోజులాగే గురువారం సాయంత్రం హబ్సిగూడలోని ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి స్కూటీపై ఇంటికి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో ఓ లారీ స్కూటీని ఢీకొట్టడంతో కామేశ్వరి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

Recent

- Advertisment -spot_img