బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైతాన్’. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ హారర్ మూవీలో మాధవన్ నెగెటివ్ రోల్ లో కనిపించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. నిన్న అర్ధరాత్రి నుండి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. వికాష్ భాల్దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జ్యోతిక తన కీలక పాత్రతో మెప్పించింది. సైతాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 211 కోట్లకు పైగా వసూలు చేసింది.