ఇదేనిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, నేరెళ్ల గ్రామంలో విద్యుత్ ఘాతంతో ఇల్లు దగ్ధం అయిన బాధిత కుటుంబానికి సింగపూర్ మిత్రులు మరియు బిజేపి నాయకులు ఆర్థిక సహాయం అందించారు. నేరెళ్ల గ్రామానికి చెందిన నూకల రమేష్ – సత్తవ్వ దంపతుల నివాసం 5-9-2024 రోజు అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకుని, వారి కుటుంబానికి సింగపూర్ మిత్రులు& బిజేపి నాయకులు కలిసి 6500/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.