Homeఫ్లాష్ ఫ్లాష్House Price Hike Soon : ఆకాశాన్నంట‌నున్న‌ ఇండ్ల ధరలు

House Price Hike Soon : ఆకాశాన్నంట‌నున్న‌ ఇండ్ల ధరలు

భాగ్యనగరంలో ఇండ్ల ధరలు పెరుగుతాయన్న విశ్వాసం హైదరాబాదీల్లో మెండుగా ఉంది.

ఈ భావన తాజాగా ఒక సర్వేలో గట్టిగా కన్పించింది.

వచ్చే 12 నెలల్లో తమ ఇండ్ల ధరలు 10 శాతంపైగా పెరుగుతాయంటూ హైదరాబాద్‌లో అధికశాతం ఇండ్ల యజమానులు రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ నిర్వహించిన సర్వేకు తెలిపారు.

80 శాతం మంది గృహయజమానులు ధరలు పెరగవచ్చని అంచనావేస్తుండగా, 57 శాతం మంది 10 నుంచి 19 శాతం వరకూ పెరుగుతాయని పేర్కొన్నారు.

కరోనా సంక్షోభం మొదలైనపుడు జరిగిన సర్వేలో తమ ఇండ్ల ధరలు తగ్గుతాయన్న నిరాశను వ్యక్తంచేసినవారు, ఇప్పుడు వారి అంచనాల్ని మార్చుకోవడం గమనార్హం.

ఈ సర్వేలో పాల్గొన్నవారిలో సగానికిపైగా నగరంలోనే మరో కొత్త గృహానికి మారాలన్న సంకల్పాన్ని వెల్లడించారు.

అలాగే 55 శాతం మంది వచ్చే 12 నెలల్లో మరో కొత్త గృహాన్ని కొనుగోలుచేయాలన్న అభిలాషను వ్యక్తపర్చారు.

పలువురు ఇండ్ల కొనుగోలుదారుల అభిప్రాయాల్ని పరిశీలిస్తే హైదరాబాద్‌ హౌసింగ్‌ మార్కెట్‌ చాలా ఆశావహంగా ఉన్నట్లు అర్థమవుతున్నదని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా చీఫ్‌ ఎకానమిస్ట్‌ రజని సిన్హా చెప్పారు.

కొత్త గృహం కొనేందుకు కారణం…

భవిష్యత్తులో కొత్తగా మరో ఇంటిని కొనాలన్న నిర్ణయాన్ని పలు అంశాలు ప్రభావితం చేసినట్లు సర్వేలో వెల్లడైంది.

కుటుంబం పెద్దదవుతున్నందున కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నట్లు 43 శాతం నగరవాసులు తెలిపారు.

తాము ప్రస్తుతం ఉంటున్న ఇంటికంటే మెరుగైన గృహాన్ని కొనే ఉద్దేశ్యాన్ని 22 శాతంమంది వ్యక్తపర్చారు.

హాలీడే హోమ్‌గా ఉంచుకునేందుకు మరో ఇంటిని కొనాలనుకుంటున్నట్లు 12 శాతంమంది వెల్లడించారు.

పచ్చదనం ఉండే ప్రాంతాల్లో…

పచ్చదనంతో కళకళలాడే ప్రాంతాల్లో ఇంటిని కొనాలన్న అభిలాషను అత్యధికంగా 97 శాతంమంది హైదరాబాదీలు వ్యక్తంచేశారు.

మంచి వైద్య సదుపాయాలున్న ప్రాంతాలను 91 శాతంమంది కోరుకోగా, తాము పనిచేసే ప్రాంతానికి దగ్గరగా ఉండే ప్రదేశాన్ని 78 శాతం మంది ఎంచుకున్నారు.

ఇంటిని మారాలన్న ఆలోచన…కరోనా సంక్షోభం వచ్చిన తర్వాత ఇంటిని మారాలన్న ఆలోచన కలిగినట్లు 54 శాతం మంది చెప్పారు.

మరింత విశాలంగా ఉండే గృహానికి మారాలన్న కోరికతో కొత్త ఇంటిని కొనాలనుకుంటున్నట్లు 58 శాతంమంది తెలిపారని నైట్‌ఫ్రాంక్‌ నివేదికలో వెల్లడైంది.

Recent

- Advertisment -spot_img