మూసీ నిర్వాసితులను అనాథలను చేయమని.. వారికి అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. వెంకటస్వామి జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. బఫర్ జోన్ లో ఇల్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తామన్నారు. విపక్షాల సూచనలు తప్పకుండా స్వీకరించి కమిటీ ఏర్పాటు చేస్తామని.. మీరొచ్చి సూచనలు ఇవ్వండని చెప్పారు. అంబర్ పేటలో ఖాళీగా ఉన్న 200 ఎకరాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తామన్నారు.