Homeహైదరాబాద్latest Newsఎంత ఘోరం.. ఎంత పాపం.. మావోయిస్టులా లేక నర రక్త పిపాసులా ?

ఎంత ఘోరం.. ఎంత పాపం.. మావోయిస్టులా లేక నర రక్త పిపాసులా ?

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు కాలనీలో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్‌, తమ్ముడు ఉయిక అర్జున్‌ను మావోయిస్టులు హత్య చేశారు. పోలీసులకు మావోయిస్టుల సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో అర్ధరాత్రి వారిని నరికి చంపారు. గురువారం రాత్రి నక్సల్స్ వారి నివాసాలపైకి చొరబడ్డారు. ఇంట్లోనిద్రిస్తున్న వారిపై గొడ్డలితో దాడి చేశారు. అనంతరం వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట రెండు లేఖలను మావోయిస్టులు మృతదేహాల దగ్గర వదిలేశారు. రమేష్, అర్జున్‌లు తమ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను అందిస్తున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. ఇలా ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో వారిని చంపడం ఎంత ఘోరం వీరు అసలు మావోయిస్టులా లేక నర రక్త పిపాసులా. మావోయిస్టుల హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటనతో తెలంగాణ మరోసారి ఉలిక్కిపడింది.

Recent

- Advertisment -spot_img