Homeహైదరాబాద్latest Newsచెన్నైలో ఎలా.. హైదరాబాద్‎లో ఇలా..! దేవిశ్రీప్రసాద్ స్పీచ్ లో మార్పుకు కారణం..?

చెన్నైలో ఎలా.. హైదరాబాద్‎లో ఇలా..! దేవిశ్రీప్రసాద్ స్పీచ్ లో మార్పుకు కారణం..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఐటివలె చెన్నైలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా నిర్మాతలపై సంచలన వ్యాఖ్యలు చేసారు. నాకు నా మీద మీకు చాలా ప్రేమ ఉంది సార్.. కానీ ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కానీ నా మీద ప్రేమ కంటే.. మీకు కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి ఏంటో అర్థం కాదు సార్ అని దేవిశ్రీప్రసాద్ చెన్నైలో అన్నారు. కానీ నిన్న హైదరాబాద్‎లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీప్రసాద్ స్పీచ్ లో చాలా మార్పు కనిపించింది. దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. నా ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ నా ఫ్యామిలీ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ బ్యానర్ లో నేనే ఎక్కవ సినిమాలు చేశాను. వాళ్ళు నాకు నా ఫ్యామిలీ తో సమానం అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. అయితే దేవి మాటలతో పుష్ప 2 మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో… నిర్మాతలకి దేవికి మధ్య ఉన్న గొడవలు తొలిగిపోయాయి అని తెలుస్తుంది. అయితే అంతకుముందు ఈ సినిమా నిర్మాతలు మాత్రం దేవిశ్రీప్రసాద్ తో మాకు ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పేసారు.

Recent

- Advertisment -spot_img