– బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
ఇదే నిజం, ఏపీ బ్యూరో: పునరుద్ధరణ పేరుతో మండపాల తొలగింపునకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. బీజేపీ చేపట్టిన 26 జిల్లాల పర్యటనలో భాగంగా తిరుపతిలో బుధవారం ఆమె పర్యటిస్తున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా మండపాలను ఎలా తొలగిస్తారు?అని ప్రశ్నించారు. శ్రీవారి కానుకలను సనాతన ధర్మ పరిరక్షణకే కేటాయించాలన్నారు. టీటీడీ నిధులు తిరుపతి మున్సిపాలిటీకి ఇవ్వడం సరికాదన్నారు.