Homeహైదరాబాద్latest Newsఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి… సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి… సీఎం రేవంత్‌పై హరీష్ రావు ఫైర్

గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అని బీఆర్‌ఎస్‌ నేత హరీష్ రావు ఆరోపించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, గత 11 నెలల కాంగ్రెస్ పాలనలో ఒకరు కాదు ఇద్దరు కాదు 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు. గురుకుల భోజనంలో నాణ్యత లేకుంటే బాలల దినోత్సవం రోజున సీఎం ప్రగల్భాలు పలుకుతున్నారే తప్ప చర్యలు తీసుకోలేదన్నారు.. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసింది. ఎంతో భవిష్యత్తు కలిగిన విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభుత్వం చోద్యం చూడడం శోచనీయం అని అన్నారు. ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. దీనికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి అని తెలిపారు. వాంకిడిలో గురుకులంలో పాఠాలు వినాల్సిన విద్యార్థిని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నది.
కారణం ఎవరు.?.. ఉన్నత స్థాయికి చేరుకొని తల్లిదండ్రుల కలను సాకారం చేయాలనుకున్న బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి కారణం ఎవరు? అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే, గురుకులాలలో.. గత 11 నెలల్లో సగటున నెలకు ముగ్గురు ప్రాణాలు కూలిపోతున్నారు అని తెలిపారు, ఈ మరణాలకు కారణం ఎవరు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో ఇదే పరిస్థితి కొనసాగడం దురదృష్టకరమన్నారు. ఘనత వహించిన కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు అని తెలిపారు. బిఆర్ఎస్ పాలనలో గురుకులాలుదేశానికి రోల్ మోడలుగా నిలించింది, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకి దిగజారిపోతుండడం బాధాకరం అని విచారం వ్యక్తం చేసారు. ఇంకెంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవాలి ముఖ్యమంత్రి గారు.. ఇంకెప్పుడు మీ కార్యచరణ మొదలుపెట్టి విద్యార్థులను కాపాడుతారు అని ప్రశ్నించారు. ఈ చావులకు ప్రభుత్వం బాధ్యత వహించి, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేసారు.

Recent

- Advertisment -spot_img