శృంగారం..మన శరీరంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఇది మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. బీపీ,టెన్షన్ తగ్గించడంలో సహాయపడుతుంది. శృంగారం మనకు విశ్వాసాన్ని ఇస్తుంది, మంచి నిద్ర, రక్త ప్రసరణ, మన వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులను తెస్తుంది. ఓ నివేదిక ప్రకారం నెలలో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనవచ్చనే దానికి పరిమితి లేదు. పరిస్థితిని బట్టి మీరు ఎప్పుడైనా శృంగారంలో పాల్గొనవచ్చు. కానీ కొందరు డాక్టర్లు, నిపుణులు.. వారానికి ఒకసారి సంభోగాన్ని సిఫార్సు చేస్తారు. ఇది భాగస్వాముల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతుందని, మంచి సంబంధానికి దారితీస్తుందని అంటారు.
మితిమీరిన లైంగిక కార్యకలాపాల వల్ల కలిగే సమస్యలు: లైంగిక కార్యకలాపాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో.. అదేరీతిలో మితిమీరిన శృంగారం తీవ్రమైన దుష్ప్రభావాలను కూడా కలిగిస్తుంది. స్ట్రెస్ రిలీఫ్ గా ఉండే శృంగారం కొన్నిసార్లు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ అది శారీరక నొప్పిని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది వెన్నునొప్పికి దారితీస్తుంది. తరచుగా శృంగారం చేయడం వల్ల పురుషులలో స్ఖలనం సమస్యలు వస్తాయి. అదేవిధంగా, ఇది మహిళల్లో క్లైమాక్స్‌లో ఇబ్బంది లేదా ఆలస్యం కలిగిస్తుంది. సంతానం వద్దనుకునే వారు ఎక్కువ శృంగారంతో గర్భం దాల్చే అవకాశం ఉంది.